AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఎలక్షన్‌లా? లేక సెలక్షన్‌లా? ఏపీ స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పారదర్శకమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఎన్నికలు నిర్వహించిందని ఆరోపించారు. మహాభారతంలో శకుని మాయాపాచికల మాదిరిగా ఎన్నికల ప్రక్రియను రిగ్ చేశారని, ఇవి ఎన్నికలా? లేక సెలక్షన్‌లా? అంటూ ప్రశ్నించారు.

ఇవి ఎలక్షన్‌లా? లేక సెలక్షన్‌లా? ఏపీ స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..!
Ys Jagan Alleges Election
Balaraju Goud
|

Updated on: Nov 05, 2026 | 4:41 PM

Share

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పారదర్శకమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఎన్నికలు నిర్వహించిందని ఆరోపించారు. మహాభారతంలో శకుని మాయాపాచికల మాదిరిగా ఎన్నికల ప్రక్రియను రిగ్ చేశారని, ఇవి ఎన్నికలా? లేక సెలక్షన్‌లా? అంటూ ప్రశ్నించారు.

హామీల అమలులో వైఫల్యంతోనే అక్రమాలు!

సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా 143 హామీలను అమలు చేయలేకపోవడంతో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ప్రభుత్వ వ్యవస్థలను అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉపయోగించుకుందని విమర్శించారు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించారని, అరెస్టులు చేశారని ఆరోపించారు.

నామినేషన్ల దశ నుంచే అడ్డంకులు

టీడీపీ కార్యకర్తలతో పోలీసులు కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. స్క్రూటినీ సమయంలో పత్రాలు మాయం చేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం, నామినేషన్లు తిరస్కరించడం వంటి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 17 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదని, మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ లేకుండా చేశారని తెలిపారు. పులివెందులలో 40 వార్డులకు గాను 20 వార్డుల్లో మాత్రమే తమ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని వెల్లడించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుపైనా అభ్యంతరాలు

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నామినేషన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని జగన్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో 11,378 పోలింగ్ కేంద్రాలకు గాను 5,737 కేంద్రాల్లో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేశారని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 31,460 కేంద్రాలకు గాను 16,064 కేంద్రాల్లోనే కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం తీరుపైనా విమర్శలు

పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదని, పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లనివ్వలేదని జగన్ ఆరోపించారు. విశాఖలో తమ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాతే స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారని పేర్కొన్నారు. చంద్రబాబు, అధికారులు, పోలీసులు, రిటర్నింగ్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల వ్యవస్థను అధికార పార్టీ గుప్పిట్లోకి తీసుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉండాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us