AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఆ మంత్రికేమో ఎంపీ కావాలని.. ఆ ఎంపీ టార్గెట్ రాష్ట్ర కేబినెట్ మంత్రి పదవి.. ఈ ఇద్దరి కోరికలు తీరేనా..

Vizag News: సాధారణంగా మంత్రులుగా ఉన్న వాళ్ళు తదుపరి ఎన్నికల్లో కూడా మంత్రే కావాలని కోరుకుంటారు. అందుకోసం చాలా రాజకీయం చేస్తారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఓ యువ మంత్రి మాత్రం ఈసారి ఎంపి కావాలని కోరుకుంటుంటే రాజకీయాల్లోకి వచ్చీ రాగానే లోక్ సభలో అడుగు పెట్టిన ఆ ఎంపికి ఢిల్లీ బోర్ కొట్టేసిందట. రాష్ట్ర కేబినెట్ లో ఉండాలన్న టార్గెట్ తో అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నారట. ఈ రెండు ప్రతిపాదనల పట్ల మొదట్లో కాస్త ఆలోచనలో పడ్డ అధిష్టానం ఇప్పుడు ఆ దిశగా సానుకూలంగా ఆలోచిస్తోందట. వివరాలేంటో చూద్దామా!

AP Politics: ఆ మంత్రికేమో ఎంపీ కావాలని.. ఆ ఎంపీ టార్గెట్ రాష్ట్ర కేబినెట్ మంత్రి పదవి.. ఈ ఇద్దరి కోరికలు తీరేనా..
Vizag YCP
Eswar Chennupalli
| Edited By: Sanjay Kasula|

Updated on: Jul 31, 2023 | 2:49 PM

Share

విశాఖపట్నం, జూలై 31: కీలక పోర్ట్ ఫోలియోలతో మొదటి సారి ఎమ్మెల్యే గానే కేబినెట్ బెర్త్ పదవి దక్కుంచుకున్న యువ మంత్రి అనగానే గుర్తొచ్చే పేరు అమర్ నాథ్ . ఇప్పటికీ అమర్ వయసు 38 సంవత్సరాలే. తాత ఎమ్మెల్యే, తండ్రి మంత్రి అయినా అనేక ఆటు పోట్లు తట్టుకుని కుటుంబ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టిన అమర్ కు మొదటినుంచీ ఎంపీ కావాలన్నది కోరిక అట. అమర్ ఆసక్తి తో పాటు సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో 2014 లోనే అనకాపల్లి ఎంపి గా బరిలోకి దిగినా అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలవడంతో తన కోరిక నెరవేరలేదు. ఆ అసంతృప్తి తో నే మళ్ళీ ఎంపి గా పోటీ చేయాలని అనుకున్నా మళ్లీ మారిన సమీకరణాల తో 2019 లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కి పోటీ చేయాల్సి వచ్చింది.

ఈసారి అమర్ నెగ్గడం, రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ లో భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, మౌళిక సదుపాయాలు, వాణిజ్యం తో పాటు ఐటీ లాంటి కీలక పోర్ట్ ఫోలియో లతో కేబినెట్ పదవి దక్కించుకోవడం తో ఇక అమర్ అనకాపల్లి అసెంబ్లీ లో స్థిరపడిపోయాడన్న అభిప్రాయం అందరిలో నెలకొంది.

అమర్ కోరిక కు సానుకూలంగా అధిష్టానం

అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి షేప్ తీసుకుంటాయో తెలియదు కదా. ప్రస్తుతం అమర్ 2024 పోటీ పై ఆసక్తికర చర్చ లు జరుగుతూ ఉన్నాయ్. అమర్ కేబినెట్ లో కీలక మంత్రి కాబట్టి మళ్లీ అనకాపల్లి నుంచే పోటీ చేస్తారన్న చర్చ ప్రధానంగా సాగుతోంది. మొదట్లో యలమంచిలి, పెందుర్తి, గాజువాక లాంటి నియోజక వర్గాలలో ఒకదాని నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా ఒక కేబినెట్ మంత్రినే తన నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సి వచ్చిందన్న చర్చ నెగటివ్ సంకేతాలను పంపే అవకాశం ఉందని అనకాపల్లి అసెంబ్లీ నుంచే పోటీ చేసేలా సిద్దంగా ఉండాలనీ అమర్ కు కూడా అధిష్టానం చెప్పిందట. అదే సమయంలో అవకాశం ఉంటే తనకు ఎంపి గా పోటీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని అమర్ తన చిరకాల కోరిక ను కూడా అధిష్టానం ముందు ఉంచారట. మొదట దానికి అంగీకరించకపోయినా ప్రస్తుతం ఆదిశగా కూడా వైఎస్సార్సీపీ ఆలోచిస్తుందట.

విశాఖ ఈస్ట్ అసెంబ్లీ పై ఎంపి కన్ను

విశాఖ ఎంపి ఎం వి వీ సత్యనారాయణ విశాఖ ఈస్ట్ నుంచి అసెంబ్లీ కి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి మంత్రి కావాలన్న లక్ష్యంతో ఉన్నాడట. దీంతో విశాఖ లోక్ సభ నుంచి ఎవరిచే పోటీ చేయించాలన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అన్వేషిస్తోందట. వాస్తవానికి అక్కడ ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న అక్కరమాని విజయ నిర్మల కే ఈస్ట్ టికెట్ ఇస్తామని సీఎం చెప్పినా ఎన్నికల నాటికి సర్వే ఫలితాలను బట్టి టికెట్ల ఉంటాయని, ఆ మేరకు నాకు పోటీ చేసే అవకాశం దక్కుతుందన్నది ఎం వివి ఆశ, ఆవిధంగానే ఈస్ట్ నుంచి అసెంబ్లీ కి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట ఎం వి వీ. అదే సమయంలో అనకాపల్లి ఎంపి గా ఉన్న సత్యవతి ని మళ్లీ లోక్ సభ కు పోటీ చేయించే ఆలోచన వైఎస్సార్సీపీ కి లేదట. అక్కడా అభ్యర్దిని మార్చాలన్న ఆలోచనలో ఉందట వైఎస్సార్సీపీ. దీంతో ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులను అన్వేషిస్తున్న వైఎస్సార్సీపీ కి అమర్ ఒక మంచి ఆప్షన్ లా కనిపిస్తున్నాడట. రెండు జిల్లాలో బలమైన బీసీ – తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన అమర్ ఎక్కడ నుంచి చేసినా పార్టీకి బెనిఫిట్ అవుతుందన్న ఆలోచనలో ఉందట పార్టీ.

అందుకే సామాజిక వర్గ సమీకరణాల తో సోషల్ ఇంజినీరింగ్ చేస్తోందట పార్టీ. అనకాపల్లి లో కాపు ఎంపి అభ్యర్ధి అయితే ఎమ్మేల్యే గవర సామాజిక వర్గానికి ఇవ్వాలి, దాన్ని సత్యవతి కా, లేక దాడి కుటుంబానికి అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోందట. అదే సమయంలో విశాఖ లోక్ సభ లో కూడా సోషల్ ఇంజినీరింగ్ చేస్తోందట వైఎస్సార్సీపీ. పొత్తులు ఉంటే టీడీపీ నుంచి ఎవరు చేస్తారు, లేకుంటే బీజేపీ నుంచి ఎవరు? జన సేన నుంచి ఎవరు? జేడీ లక్ష్మీ నారాయణ? ఇలా విశాఖ లోక్ సభ పోటీ అనేక అంశాలతో ముడిపడి ఉన్న అంశం గా మారింది.

దీంతో అమర్ అసెంబ్లీ కి చేస్తే అనకాపల్లి నుంచే పోటీ చేస్తారని, అలా కాకుండా పార్లమెంట్ కు పోటీ చేయాల్సి వస్తె మాత్రం అనకాపల్లి, లేదా విశాఖ లోక్ సభ లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయొచ్చన్నది తాజా బజ్. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కాబట్టి ఎన్నికల నాటికి ఇలాంటి ఎన్ని సిత్రాలు చూడాల్సి వస్తుందో అన్నది సగటు రాజకీయనాయకుడి విశ్లేషణ..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం