AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నారా..? జీవితం బలవుతుంది జాగ్రత్త..!

మొన్నటి వరకూ క్రికెట్ బెట్టింగ్ తో యువకులు బలయ్యేవారు. ఆ ఉచ్చులో చిక్కి బాగా.. అప్పుల పాలై.. ఆత్మహత్యలు చేసుకోవడం వంటి నేరాలకు పాల్పడేవారు. ఇప్పుడు ఆన్ లైన్ గేమ్స్ కి జీవితాన్ని బలి పెట్టేస్తున్నారు.

Andhra Pradesh: ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నారా..? జీవితం బలవుతుంది జాగ్రత్త..!
Online Rummy
Ram Naramaneni
|

Updated on: Sep 04, 2022 | 3:49 PM

Share

Sri sathya sai district: శ్రీసత్యసాయి జిల్లాలో- ఓబులదేవర చెరువు మండలం- కొండకమర్లలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొండకమర్లలోని పశువుల ఆస్పత్రి దగ్గర్లో ఉంటోన్న హేమంత్ బాబు కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆన్ లైన్ రమ్మీ గేమ్స్ కి అలవాటు పడ్డ.. ఇతడు రమ్మీ గమ్మత్తులో చిక్కాడు. రమ్మీ యాడ్లు చూసి.. ఇందులోకి దిగిన హేమంత్ కి అక్కడ ప్రకటనల్లో కనిపించేది ఒకటి.. ఇక్కడ అసలు రియల్ గేమ్ మరొకటిగా కనిపించ సాగింది. ఈ ఆట పోతే.. మరొక ఆటగా ఫీలైన హేమంత్ ఆడుతూ వెళ్లాడు. వ్యసనంలోకి దిగడం పులి మీద స్వారీ చేయడం ఒకటే. ఎంట్రీ ఇచ్చే వరకే చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత మన చేతుల్లో ఏదీ ఉండదు. అంతా అదే కానిచ్చేస్తుందన్న సూత్రాన్ని అనుసరించి.. హేమంత్ కూడా.. రమ్మీలోకి దిగి.. అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇటు దిరిగి చూసే సరికి.. ఆన్ లైన్ రమ్మీలో హేమంత్ మూడు లక్షల వరకూ అప్పుల పాలై పోయాడు. రమ్మీ ఆడ్డం వల్ల వచ్చిన లాభమేంటో తెలీదు కానీ.. నష్టం మాత్రం భారీ ఎత్తున కనిపించింది. అప్పుల బెడద ఎక్కువయ్యింది. దీంతో ప్రతి రోజూ ఈ టార్చర్ తట్టుకోలేక పోయాడు హేమంత్.

రమ్మీలో వచ్చే దారి కనిపించక- చేసిన అప్పు తీర్చే మార్గం అగుపించక.. ఒక నిర్ణయానికి వచ్చాడు. బలవన్మరణానికి పాల్పడితే తప్ప.. లాభం లేదనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి.. చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి వచ్చి విచారించారు. హేమంత్ భార్య ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేశారు. అందుకే ఆన్ లైన్ లో టెంప్టింగ్ యాడ్స్ చూసి.. ఎంట్రీ ఇస్తే.. అప్పుల పాలవడం తప్ప మరేం మిగలదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..