AP Politics: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. కాకినాడ జిల్లా నేతలూ అలెర్ట్ అవుతున్నారు. తాజాగా.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత తోట నరసింహం కాకినాడ పాలిటిక్స్‌లో సెంటరాఫ్ యాక్షన్‌గా మారబోతున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయిన తోట నరసింహం.. ఇప్పుడు హెల్త్ సెట్ అవడంతో రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ అయినట్లే తెలుస్తోంది. ఆరోగ్యం కుదుటపడ్డాక ఫస్ట్ టైమ్ జగ్గంపేటలో అడుగుపెట్టారు తోట నరసింహం.
జగ్గంపేట మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. తన అనుచరులను కలుసుకోవడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా.. అవకాశం వస్తే మళ్లీ ప్రజా సేవలో భాగస్వామ్యం అవుతానన్నారు తోట నరసింహం. జగన్ అవకాశం ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి మరోసారి ప్రజాసేవకు అంకితమవుతానని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా జగ్గంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. అనారోగ్యంతో ఏడాది కాలంగా బయటకు రాలేకపోయానని.. ప్రస్తుతం అంతా సెట్ కావడంతో.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పారు. కార్యకర్తలకు త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాననన్నారు తోట నరసింహం.
అలాగే.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇక.. సీనియర్ నేత తోట నరసింహం చేసిన కామెంట్స్ కాకినాడ జిల్లాలో కాక రేపుతున్నాయి. మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్ అవుతానని ప్రకటించడంతోపాటు.. జగన్ చాన్స్ ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఇన్‌డైరెర్ట్‌గా చెప్పారు. మరి రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లా వైసీపీ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..