AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VijayaSai Reddy: టీపీసీసీ అధ్య‌క్షుడి ఎంపికపై స్పందించిన ఎంపీ విజ‌యసాయి రెడ్డి.. వ‌రుస ట్వీట్ల‌తో..

VijayaSai Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్య‌క్షుడిగా ఎన్నిక‌కాగానే రేవంత్ కాంగ్రెస్ పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌ను నేరుగా క‌లుస్తూ బిజీబిజీగా...

VijayaSai Reddy: టీపీసీసీ అధ్య‌క్షుడి ఎంపికపై స్పందించిన ఎంపీ విజ‌యసాయి రెడ్డి.. వ‌రుస ట్వీట్ల‌తో..
Vijaya Sai Reddy
Narender Vaitla
|

Updated on: Jun 28, 2021 | 12:02 PM

Share

VijayaSai Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్య‌క్షుడిగా ఎన్నిక‌కాగానే రేవంత్ కాంగ్రెస్ పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌ను నేరుగా క‌లుస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో ఉన్న ఎంతోమందిని సీనియ‌ర్ లీడ‌ర్స్‌ను కాద‌ని రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో పార్టీలో వ్య‌తిరేక‌త కూడా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నేతలు బ‌హిరంగానే రేవంత్ రెడ్డి ఎంపిక‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణకే ప‌రిమిత‌మైన టీపీసీసీ అధ్య‌క్ష ఎంపిక విష‌యం ఇప్పుడు ఆంధ‌ప్ర‌దేశ్‌కు కూడా చేరింది. తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ అంశంపై త‌న‌దైన శైలిలో స్పందించారు. చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ పలు వ‌రుస ట్వీట్లు చేశారు. ఇంతకీ విజ‌య సాయి రెడ్డి చేసిన ట్వీట్లు ఏంటంటే..

కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలాడు. బాబా మజాకా!

పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు.

మహా వృక్షం నలువైపులా విస్తరించి నీడను పరుస్తుంది. ఎన్నో పక్షులకు ఆవాసం అది. ఒక దుర్జనుడి బుర్రకి అది మరోలా కనిపించింది. కొమ్మల భారానికి వృక్షం కుంగి ఆవస్థ పడుతోందని అనుకున్నాడు. కొమ్మలు నరికి మోడును మాత్రం మిగిల్చి మురిసిపోయాడు. ఆ మూర్ఖుడి పేరు ఏ ‘లోకమో’ చెప్పుకోండి? మ‌రి విజ‌య‌సాయి రెడ్డి చేసిన ట్వీట్ల‌పై ఇటు చంద్ర‌బాబు గానీ, రేవంత్ రెడ్డి గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: నాడు నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్మిన మహిళ నేడు ఎస్ఐ… కేరళలో మారిన ఆమె జీవిత గమ్యం

Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్

Lake Shiva Afghanistan: ఒకప్పుడు అఖండ భారతావనిలోని ఆప్ఘనిస్థాన్ లో శివుడిపేరుతో సరస్సు..