Andhra Pradesh: గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. బీజేపీ నేతలు జీవీఎల్, సోము వీర్రాజు, సునీల్ డియోదర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు జిన్నా సెంటర్ ఇప్పుడే ఎందుకు గుర్తొస్తోందని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 1998-2004 వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కానీ, 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ ఎందుకు గుర్తు రాలేదు? అని ప్రశ్నించారు. అసలు జాతీయ పతాకంలోని మూడు రంగులకు అర్థం తెలుసా? బీజేపీ నేతలకు చురకలంటించారు. జాతీయ జెండాను.. ప్రజల మధ్య అగ్గి రాజేయడానికి, సమైక్యతకు విఘాతం కలిగించడానికి వాడుకుంటారా? అని బీజేపీ నేతల విధానాలను తూర్పారబట్టారు. దేశ విభజనలో జిన్నా పాత్ర గురించి అందరికీ తెలుసునని, ఇప్పుడు తెలియాల్సింది జిన్నా పేరు వాడుకుని మన సమాజాన్ని విభజించాలనుకుంటున్న వారి గురుంచి మాత్రమే నంటూ బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి.
Also read:
TS Corona Cases: తెలంగాణలో మరోసారి పెరిగిన కోవిడ్ కేసులు.. జిల్లాల వారికి ఇలా..