Andhra Pradesh: ఆయన కుంభకర్ణుడు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైసీపీ నేతలు

|

Jul 28, 2023 | 7:20 AM

చంద్రబాబు సొంత ఊరిలో ప్రైమరీ స్కూల్‌ను కూడా బాగు చేయలేదని మండిపడ్డారు. మరోవైపు ఏపీలో మహిళల అదృశ్యంపై మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ మణిపూర్‌ఘటనపై ఎందుకు స్పందించడం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రానికి సలహాలు..

Andhra Pradesh: ఆయన కుంభకర్ణుడు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైసీపీ నేతలు
Roja
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే వైసీపీ నేతల జాబితాలో మంత్రి ఆర్కే రోజా ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై రోజా భగ్గుమన్నారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆరోపించారు మంత్రి రోజా.

అటు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. చంద్రబాబుకు పక్కవారిని విమర్శించే అర్హత లేదన్నారు. కుప్పం నుంచి 6సార్లు గెలిచిన చంద్రబాబు అక్కడ ఒక ఆర్టీవో ఆఫీస్ మున్సిపాలిటీ అయినా కట్టించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత ఊరిలో ప్రైమరీ స్కూల్‌ను కూడా బాగు చేయలేదని మండిపడ్డారు. మరోవైపు ఏపీలో మహిళల అదృశ్యంపై మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ మణిపూర్‌ఘటనపై ఎందుకు స్పందించడం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. పవన్ కల్యాణ్‌ ఏ ఆధారంగా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో బీజేపీ స్థానం ఏంటో ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమితులైన పురందేశ్వరి తెలుసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. మరోవైపు ఏపీ రాజధాని తరలింపు ఈ సంవత్సరంలో ఉంటుందని హాట్‌ కామెంట్‌ చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..