VSR on BJP-TDP Alliance: మేం పొత్తు వద్దునుకున్న తర్వాతే టీడీపీతో బీజేపీ కలిసిందిః విజయసాయిరెడ్డి

రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి.. పార్టీ నిర్ణయం మేరకు నెల్లూరు లోక్‌సభ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయసాయిరెడ్డి.. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

VSR on BJP-TDP Alliance: మేం పొత్తు వద్దునుకున్న తర్వాతే టీడీపీతో బీజేపీ కలిసిందిః విజయసాయిరెడ్డి
Vijaya Saireddy In Cross Fire

Updated on: Apr 11, 2024 | 7:31 PM

రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి.. పార్టీ నిర్ణయం మేరకు నెల్లూరు లోక్‌సభ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయసాయిరెడ్డి.. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి పోటీగా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. నిన్నటి వరకు కలిసి పనిచేసిన వాళ్లే ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు.

నిజానికి ఈ ఇద్దరు మంచి మిత్రులు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఇద్దరి మధ్య మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమాటకొస్తే.. 2019 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒప్పించి వైసీపీలో చేర్పించింది విజయసాయిరెడ్డే. అలాంటిది తాను తీసుకొచ్చిన వేమిరెడ్డి తోనే విజయసాయిరెడ్డి తలపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ తోపాటు శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌ ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన అంశాలను సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు.

ఏపీలో కూటమిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 2014లోనే ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ను చూశామని, ఆ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఏపీ దివాళ తీసిందని అన్నారు. రెండు ఇంజిన్లు చెరో డైరెక్షన్‌లో వెళ్లి రాష్ట్రానికి నష్టం చేశాయని ఎద్దేవా చేశారు. నాడు గ్రామీణాభివృద్ధి నిలిచిపోయి, అవినీతి పెరిగిపోయిందన్నారు. మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం విడ్డూరమన్నారు. తాము పొత్తును వద్దునుకున్న తర్వాతే టీడీపీతో బీజేపీ కలిసిందన్నారు విజయసాయిరెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…