Andhra Pradesh: చంద్రబాబు ప్రోద్భలంతోనే అవన్నీ.. మీ పార్టీ రికార్డింగ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి.. వైసీపీ నేత దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..
వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు తగ్గేదేలే అంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఓ పార్టీ నాయకులు మరో పార్టీ..
Andhra Pradesh: వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు తగ్గేదేలే అంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఓ పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులను విమర్శిస్తే.. వెంటనే ప్రతిగా అవతలి పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అదే స్థాయిలో అసభ్య పదజాలంతో విమర్శలుచేస్తున్నారు. ఈక్రమంలో వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిపించుకుని.. వైసీపీ పార్టీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలని చెప్పింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే అని దేవినేని అవినాష్ విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశి, దేవినేని అవినాష్ ల మీద శపధాలు చేసి, తొడలు కొట్టాలని చెప్పిందే చంద్రబాబేనని ఆరోపించారు. స్టేజ్ మీద తొడలు కొట్టి, శపధాలు చేసిన వాళ్ల జాతకాలు ఏంటో తనకు తెలుసని.. మీ చీకటి బతుకులు తనకు తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దేవినేని అవినాష్.
ఉదయం చంద్రబాబుని దేవుడు అంటారు రాత్రి అయితే అదే చంద్రబాబుని విమర్శించే టీడీపీ నాయకులు తమగురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా లక్షల రూపాయలు తీసుకుని టికెట్లు కేటాయించే చరిత్ర తెలుగుదేశం పార్టీదంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. మీ పార్టీ రికార్డింగ్స్ అన్ని తమ దగ్గర ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఏం చేయాలో తోచక.. కవ్వింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీని విమర్శించారు. సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని గాని, వారి కుటుంబాన్ని విమర్శిస్తే మాత్రం.. గతంలో వలె రియాక్షన్ ఉంటుందంటూ హెచ్చరించారు. విజయవాడలో టీడీపీ భూస్ధాపితం అయిపోయిందని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తన గురించి మాట్లాడటం మాని.. సొంత పార్టీ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన బుద్దావెంకన్నకు జరిగిన అవమానం గురించి మాట్లాడాలంటూ సూచించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ప్రధాన పాత్రధారి గద్దె రామ్మోహన్ అంటూ మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు దేవినేని అవినాష్. బురద రాజకీయాలు,చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..