AP MPTC ZPTC Elections Result: చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ హవా.. తుడిచి పెట్టుకుపోయిన తెలుగుదేశం
AP MPTC ZPTC Elections Result Updates: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో తుడిచి పెట్టుకుపోయింది తెలుగుదేశం. నాలుగు మండలాల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైసీపీకి 17, టీడీపీకి 2 వచ్చాయి.
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో తుడిచి పెట్టుకుపోయింది తెలుగుదేశం. నాలుగు మండలాల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైసీపీకి 17, టీడీపీకి 2 వచ్చాయి. గుడిపల్లె మండలంలో 12 సీట్లలోనూ అధికార పార్టీనే గెలిచింది. రామకుప్పం మండలంలో 16 స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ గెలిచింది.
జడ్పీటీసీ ఫలితాలు ఇదే విధంగా వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీకి దారుణ ఓటమి ఎదురైంది. వైసీపీ అభ్యర్థి రాజయ్య వేయి ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. నాలుగు మండలాల్లోని 89 పంచాయతీల్లో 75 చోట్ల వైసీపీ, 14 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. కుప్పం నియోజకవర్గంలో 85 శాతానికిపైగా పంచాయతీల్లో వైసీపీ గెలిచింది. అదే ఫలితాలు పరిషత్ ఎన్నికల్లోనూ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Kalonji Farming: కలోంజి సాగుతో ఏడాదికి లక్షల రూపాయలు సంపాదన.. ఇది ఎలా సాగు చేయాలో తెలుసుకోండి..