కడప జిల్లాలో వెలుగు చూసిన దారుణ హత్య.. పెళ్లి చేసుకుంటావా అని అడిగినందుకు ప్రాణం తీశారు..

పెళ్లి చేసుకుంటావా అని సరదాగా అడిగినందుకు ఇద్దరు మైనర్లు ఏకంగా ఓ మహిళ ప్రాణాలు తీశారు. కడప జిల్లాలో

కడప జిల్లాలో వెలుగు చూసిన దారుణ హత్య.. పెళ్లి చేసుకుంటావా అని అడిగినందుకు ప్రాణం తీశారు..
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2020 | 12:55 PM

పెళ్లి చేసుకుంటావా అని సరదాగా అడిగినందుకు ఇద్దరు మైనర్లు ఏకంగా ఓ మహిళ ప్రాణాలు తీశారు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మకు ఇరవై ఏళ్ల క్రితం బక్కన్నగారి పల్లెకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. విభేదాలు రావడంతో రెండు నెలలకే భర్తను వదిలేసింది. ఆ తర్వాత సింహాద్రిపురం మండలం, బిదినం చేర్లకు చెందిన మరో వ్యక్తికిచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. 9ఏళ్ల తర్వాత రెండో భర్తను కూడా ఆమె వదిలేసి పుట్టింటికి వచ్చింది. స్థానికంగా మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తోంది.

అయితే ఇటీవల మేకలు మేపేందుకు వెళ్లిన నాగమ్మ గుట్టల్లో శవంగా కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.పెద్దకుడాల గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లతో నాగమ్మ సరదాగా పెళ్లి చేసుకుంటారా అని అడిగిందట. దీంతో నాగమ్మ మాటలను సీరియస్ గా తీసుకున్న మైనర్లు గుట్టల్లోకి వెళ్లి పెళ్లి సంగతేంటని నిలదీశారు. తాను సరదాగా అన్నానని నాగమ్మ చెప్పడంతో ఆమెను కౌగిలించుకున్నారు. వెంటనే ప్రతిఘటించిన ఆమె ఇంట్లో పెద్దలకు, గ్రామస్తులకు చెప్తానని బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన మైనర్లు ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!