దంపతులు తల్లిదండ్రులు అయ్యే రోజు కోసం ఎంతో ఇష్టంగా ఎదరు చూస్తారు. మాతృత్వం అనేది స్త్రీకి పెద్దవరం. అమ్మ అనే పిలుపుతో స్త్రీ మూర్తికి గౌరవం దక్కుతుంది. అమ్మా అనే పిలుపుతో ఆడజన్మ సార్దకం అని భావిస్తుంది. సంతానం కోసం ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులకు బంపర్ ఆఫర్ తగిలింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే సారి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆళ్లగడ్డ పట్టణంలోని పాత మసీదు వీధికి చెందిన ఆవుల స్వప్న, ప్రకాష్ లకు 8 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే పిల్లలు లేకపోవడంతో వివిధ ఆసుపత్రులలో చూపించుకున్నారు. కొన్ని నెలల క్రితం స్వప్న గర్భం దాల్చింది. ఆళ్లగడ్డ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా ముగ్గురు శిశువులు ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి వైద్యుల సలహాలు సూచనలను పాటిస్తూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది స్వప్న. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆమెకు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్వప్నకు సాధారణ కాన్పు చేశారు. ఒకే కానుపులో భగవత్ ప్రసాదంగా ఇద్దరు మగ శిశివులు, ఒక ఆడ శిశువు జన్మించారు. ముగ్గురు శిశువులతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 8 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఆ దంపతులకు త్రిబుల్ ఆఫర్ , బంపర్ ఆఫర్ వచ్చినట్లు అయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..