Chandra babu Naidu: చంద్రబాబు రూటు మార్చారా ?.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారా..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ప్రజల మద్దతు పొందాలని నిర్ణయించుకున్నాడా? అందుకు రానున్న ఎన్నికలను వేదికగా ఎంచుకున్నాడా?.. అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ నిజమేనా? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెల 9వ తేదీన జిల్లా కేంద్రమైన నంద్యాలలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ప్రజల మద్దతు పొందాలని నిర్ణయించుకున్నాడా? అందుకు రానున్న ఎన్నికలను వేదికగా ఎంచుకున్నాడా?.. అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ నిజమేనా? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెల 9వ తేదీన జిల్లా కేంద్రమైన నంద్యాలలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు దీనిపై పెద్ద ఎత్తున చర్చించుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. గత నెల 8వ తేదీన రాత్రి 10 గంటల నుంచి 9 వ తేదీ ఉదయం 8 గంటల వరకు చంద్రబాబు అరెస్టుపై చర్చ జరిగింది. చివరకు ఆరు గంటలకు అరెస్టు చేసినట్లు చూపించి ఎనిమిది గంటలకు నంద్యాల నుంచి విజయవాడకు బయలుదేరారు.
అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు జైలులోనే ఉంటున్నారు. ఎప్పుడు బయటికి వస్తారో ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే పోలీసులు అరెస్టు చేశారో.. అక్కడి ప్రజల మద్దతు పొందాలని చంద్రబాబు మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే నంద్యాల అసెంబ్లీ నుంచి గెలవాలని అప్పుడే తన అరెస్టుకు విలువ లేకుండా ఉంటుందని చంద్రబాబుకు పలువురు సూచించినట్లు కూడా తెలిసింది. అయితే ఇదే విషయాన్ని పార్టీ అంతర్గత విషయంలో చర్చించినట్లు సమాచారం. వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండగానే జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకున్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు అరెస్టుకు ముందే చంద్రబాబు నంద్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. నంద్యాల ఉప ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది అయితే ఆ తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికలలో వైసీపీ 40000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది.
తన అరెస్టు సందర్భంగా స్థానిక నేతలు కనీస అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, కార్యకర్తలను కూడా తరలించలేకపోయారని పార్టీలో అంతర్గత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయం రానున్న ఎన్నికలలో ఇద్దరు ముగ్గురికి టికెట్లు కేటాయింపుపై ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను నంద్యాల నుంచి చంద్రబాబు పోటీ చేయాలని కొందరు సూచించినట్లు , పార్టీలో కూడా చర్చ జరిగినట్లు ప్రచారం ఉంది. కుప్పంతో పాటు నంద్యాల నుంచి కూడా పోటీ చేస్తారా.. లేకుంటే కుప్పం నుంచి పోటీ చేస్తారా, కుప్పo వదిలిపెట్టి నంద్యాలకు వస్తారా.. అనేదానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. చంద్రబాబు నంద్యాల నుంచి పోటీ చేయాలని కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే ఆహ్వానం పలికినట్లు సమాచారం. నంద్యాలలో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై పోటీ ఉంది. మాజీ మంత్రి అఖిలప్రియ తమ్ముడు జగత్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ లేదా ఆయన కొడుకు ఫిరోజ్, మరో నేత ఏవి సుబ్బారెడ్డి సీరియస్గా ప్రయత్నిస్తున్నారు.పైగా చంద్రబాబు నంద్యాల నుంచి పోటీ చేస్తే కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగనుంది అనేది వేచి చూడాల్సిందే.




