Nandyal District: డోన్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.. అదుపులోకి తీసుకున్న తన భర్తను చూపించట్లేదంటూ..
Nandyal District: నంద్యాల జిల్లా డోన్ పట్టన పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి ఆందోళన దిగింది ఓ మహిళ. తన భర్తను ఐదు నెలల క్రితం డోన్ పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, కర్నూల్ కోర్టు నుంచి బెయిల్ రావడంతో అతన్ని విడిపించుకుని వెళ్తుండగా వెంటనే విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సదరు మహిళ ఆరోపించింది. 24 గంటలు దాటినా తన భర్త ఆచూకీ ఎక్కడ అనేది పోలీసులు చెప్పకుండా దాటవేస్తున్నారని, రాత్రి 11 గంటలకు తన భర్త..
నంద్యాల జిల్లా, అక్టోబర్ 01: నంద్యాల జిల్లా డోన్ పట్టన పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి ఆందోళన దిగింది ఓ మహిళ. తన భర్తను ఐదు నెలల క్రితం డోన్ పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, కర్నూల్ కోర్టు నుంచి బెయిల్ రావడంతో అతన్ని విడిపించుకుని వెళ్తుండగా వెంటనే విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సదరు మహిళ ఆరోపించింది. 24 గంటలు దాటినా తన భర్త ఆచూకీ ఎక్కడ అనేది పోలీసులు చెప్పకుండా దాటవేస్తున్నారని, రాత్రి 11 గంటలకు తన భర్త శరీరంపై కోసుకుని గాయం చేసుకోవడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెబుతున్నారని భూలక్ష్మి తెలిపింది. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి తన భర్తను తనకు అప్పగించాలని, లేకుంటే అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అసలు తన భర్త బ్రతికే ఉన్నాడా? లేక చనిపోయాడా? అన్న అనుమానం కలుగుతోందని, దయచేసి అధికారులు స్పందించి తన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరింది.
అయితే పోలీసులు స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుటే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అది తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆమెను డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా పోలీసులు ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

