AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. మరీ ఇంత బరితెగింపా.. ప్రియుడిపై మోజులో భర్తను ఎలా చంపిందంటే..

విశాఖలో మిస్సింగ్ కేసు మిస్టరీ హత్యగా మారింది. ప్రియుడు మోజులో పడిన భార్య.. భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఏమీ తెలియనట్టుగా భర్త కనిపించడం లేదంటూ..

Andhra Pradesh: ఛీ.. ఛీ.. మరీ ఇంత బరితెగింపా.. ప్రియుడిపై మోజులో భర్తను ఎలా చంపిందంటే..
Illegal Relationship
Shiva Prajapati
|

Updated on: Jan 13, 2023 | 9:58 AM

Share

విశాఖలో మిస్సింగ్ కేసు మిస్టరీ హత్యగా మారింది. ప్రియుడు మోజులో పడిన భార్య.. భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఏమీ తెలియనట్టుగా భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కూపీ లాగితే.. అసలు విషయం బయటకు వచ్చింది. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

విశాఖ భీమిలి ప్రాంతానికి చెందిన పైడిరాజుకు జ్యోతితో వివాహమైంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుతో కొంత కాలంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది జ్యోతి. అయితే వీళ్లిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్నాడంటూ భర్తనే చంపేందుకు కుట్రపన్నింది. డిసెంబర్ 29న అన్నంలో నిద్ర మాత్రలు కలిపింది. నిద్రలోకి జారుకున్న భర్తను.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత అనాధ శవం లాగా స్మశానికి తీసుకెళ్లి దహనం చేయించింది. డిశంబర్ 30న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.

అయితే జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పైడిరాజు అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన స్టైల్‌‌లో విచారించే సరికి.. నిజం అంగీకరించారు నిందితులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..