Vijayawada: చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ.. కృష్ణా నదిలో వినూత్న కార్యక్రమం..

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో సందడి నెలకొంది. చంద్రబాబు కూడా రాజధానికి వెళ్లే కరకట్ట వద్ద ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటారు. ఈ క్రమంలోనే కరకట్ట వద్ద ఉన్న బోటు యజమానులు క్రిష్ణా నదిలో బోటు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బోట్లతో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కృష్ణా నదిలో చక్కర్లు కొట్టారు. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధానిలోని బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

Vijayawada: చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ.. కృష్ణా నదిలో వినూత్న కార్యక్రమం..
Krishna River
Follow us
T Nagaraju

| Edited By: Srikar T

Updated on: Jun 12, 2024 | 1:47 PM

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో సందడి నెలకొంది. చంద్రబాబు కూడా రాజధానికి వెళ్లే కరకట్ట వద్ద ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటారు. ఈ క్రమంలోనే కరకట్ట వద్ద ఉన్న బోటు యజమానులు క్రిష్ణా నదిలో బోటు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బోట్లతో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కృష్ణా నదిలో చక్కర్లు కొట్టారు. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధానిలోని బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పడవులకు టిడిపి, జనసేన, బిజెపి జండాలు కట్టారు. బోట్లు కృష్ణా నదిలో చక్కర్లు కొడుతుండటాన్ని ప్రకాశం బ్యారేజ్‎పై నుండి పలువురు ఆసక్తిగా తిలకించారు.

చంద్రబాబు సీఎం కావడంతోనే అమరావతి రాజధానికి పూర్వవైభవం వచ్చిందని, ఇక తమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని బోటు యజమానులు చెబుతున్నారు. మరోవైపు పర్యాటకంగా కూడా అమరావతి వద్ద ఉన్న కృష్ణా తీర ప్రాంతం అభివృద్ది చేస్తారని అంటున్నారు. గతంలోనూ పుష్కరాల సమయంలో తాడేపల్లి సీతానగరం, తాళ్లాయపాలెం శివ స్వామి ఆశ్రమం వద్ద పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సిఎం కావడం తమ ప్రాంత అభివృద్దికి తిరిగి బాటలు వేసినట్లైందని చెప్పారు.

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం లైవ్ అప్డేట్స్…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..