AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల వేటకు వెళ్లి శవాలుగా మారిన మామ అల్లుడు.. బైక్‌కు శవాలను కట్టేసిన అమానుష ఘటన!

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న గొల్లపాలెం గ్రామంలో చేపల వేటకని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చేపల వేటకు వెళ్లి శవాలుగా మారిన మామ అల్లుడు.. బైక్‌కు శవాలను కట్టేసిన అమానుష ఘటన!
Krishna District Suspected Death
Balaraju Goud
|

Updated on: Jun 29, 2026 | 3:13 PM

Share

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న గొల్లపాలెం గ్రామంలో చేపల వేటకని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్త కాలవ మొగ సమీపంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, ఈ మృతదేహాలు ఒక బైక్‌కు తాళ్లతో కట్టి ఉండటం చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరణించిన వారిని శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పగా గుర్తించారు. వీరిద్దరూ వరసకు మామ, అల్లుళ్లు అని గ్రామస్థులు తెలిపారు. చేపల వేట కోసం వెళ్లిన వీరు ఇలా విగతజీవులుగా, అదీ బైక్‌కు కట్టేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికీ హత్యేనని, ఎవరో దారుణంగా చంపి ఇలా బైక్‌కు కట్టేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న కృత్తివెన్ను పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు. పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? లేదా వేట ఇరువర్గాల మధ్య గొడవలకు దారితీసిందా? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనతో చిన్న గొల్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..