AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAPO 23: షూటింగ్ మొదలు పెట్టిన ఒంటరి తోడేలు.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాపో 23 ( వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు రామ్ దర్శకత్వం మాత్రమే కాదు కథను కూడా అందిస్తున్నాడు.

RAPO 23: షూటింగ్ మొదలు పెట్టిన ఒంటరి తోడేలు.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
Rapo23
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 2:30 PM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం రాపో 23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో హీరో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా తాజాగా హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. కథానాయకుడు రామ్ పోతినేని చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది. దర్శకత్వం, కథతో పాటు ఈ చిత్రంలో రామ్ కథానాయకుడిగానూ నటిస్తున్నారు. కెమెరా ముందు, వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావం స్పష్టమవుతోంది. తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నారు.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాలో నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. విభిన్నమైన కథ, భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ కలయికతో తెరకెక్కుతున్న #RAPO23, రామ్ పోతినేని కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..