AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం టికెట్ల జారీ బంద్.. మళ్లీ ఎప్పటినుంచంటే..?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఎస్‌ఎస్‌డీ టికెట్ల జారీని నిలిపివేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఎప్పటిలాగే టికెట్లను పంపిణీ చేయనుంది. భక్తులు దీనిని గమనించాలి.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం టికెట్ల జారీ బంద్.. మళ్లీ ఎప్పటినుంచంటే..?
Tirumala
Venkatrao Lella
|

Updated on: Jul 22, 2026 | 8:07 AM

Share

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతున్నారా..? అయితే మీకు బిగ్ అలర్ట్. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్లాటెడ్ సర్వ దర్శనం టికెట్ల జారీని బుధవారం టీటీడీ నిలిపివేసింది. ఈ టోకెన్లు తర్వాతి రోజుకు టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. అంటే ఈ రోజు టికెట్ తీసుకుంటే రేపు దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో వీటిని ప్రతీ రోజూ జారీ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ టికెట్ల జారీని బంద్ చేసింది. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం టికెట్లు జారీ చేయరు. అయితే శుక్రవారం దర్శనం చేసుకోవాలంటే గురువారం జారీ చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

గురువారం నుంచి టోకెన్ల జారీ

సాధారణంగా జులైలో రద్దీ అనేది తగ్గుతూ ఉంటుంది. వర్షాల కారణంగా ప్రతీ ఏడాది రద్దీ తగ్గుముఖం పడుతుంది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కావడంతో రద్దీ తగ్గుతుంది. కానీ రెండు వారాలుగా రద్దీ మరింత పెరిగింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీంతో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. తిరుమల వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని టీటీడీ స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం నుంచి మళ్లీ తిరిగి యథావిధిగా జారీ అవుతాయి. అయితే నేడు టికెట్లను జారీ చేయడం లేదని తెలుసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఎస్ఎస్‌డీ టోకన్లను నిలిపివేయడం వరుసగా ఇది నాలుగోవారంగా తెలుస్తోంది. బుధవారం దర్శనం కోసం మంగళవారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే కేవలం గంట సేపటికే టికెట్లు అన్నీ పూర్తయ్యాయి. దీంతో లైన్లో వచ్చినవారు కేంద్రాల వద్ద ఉండిపోయారు. దీంతో భక్తులు సమాచారం తెలుసుకుని కౌంటర్ల వద్దకు రావాలని టీటీడీ సూచిస్తోంది. అటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవందరాజస్వామి ఉత్సవమూర్తులకు జులై 24 నుంచి 26 వరకు అభిధేయక అభిషేకం నిర్వహించనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది కంపార్ట్‌మెంట్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. ఇక వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ సర్వ దర్శనం భక్తులు వేచివున్నారు.

Follow Us