AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో నాగర్‌కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, రైతులు ఉరుములు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Rain Alert: సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2026 | 7:10 AM

Share

ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతము నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో ఈదురుగాలుల హెచ్చరిక చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

సోమవారం (29-06-2026)

కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

మంగళవారం (30-06-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు.

తెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల..జనగామ, కామారెడ్డి, కరీంనగర్ జిల్లా, కొమురంభీం, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతోపాటు.. ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో..
4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో..
ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే నువ్వుల పాయసం..
విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే నువ్వుల పాయసం..
దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే..ఊడిన జుట్టు మొత్తం తిరిగిరావాల్సిందే
దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే..ఊడిన జుట్టు మొత్తం తిరిగిరావాల్సిందే
ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు.. భలే ఉంటాయ్..
ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు.. భలే ఉంటాయ్..
ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. సోమవారం రాశిఫలాలు
ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. సోమవారం రాశిఫలాలు
ఏపీలోని అండర్ రేటెడ్ టూరిస్ట్ స్పాట్..
ఏపీలోని అండర్ రేటెడ్ టూరిస్ట్ స్పాట్..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. మరింత దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. మరింత దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన రాగి పిండి అప్పాలు
ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన రాగి పిండి అప్పాలు