AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లా విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. జులై 5 నుంచి అడ్మిషన్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

TG Lawcet 2026 Counselling: రాష్ట్రంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ లాసెట్‌, టీజీ పీజీఎల్‌సెట్‌-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 5 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుండగా, అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

లా విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. జులై 5 నుంచి అడ్మిషన్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం
TG LAWCET Counselling
Srilakshmi C
|

Updated on: Jun 29, 2026 | 2:56 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 29: రాష్ట్రంలో2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్‌ (TG LAWCET), టీజీ పీజీఎల్‌సెట్‌ (TG PGLCET)–2026 ప్రవేశాల కౌన్సెలింగ్‌ మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో అందిస్తున్న మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం టీజీ లాసెట్‌, టీజీ పీజీఎల్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో జరుగుతుందని లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య ఐ పాండురంగారెడ్డి తెలిపారు.

షెడ్యూల్‌ ప్రకారం టీఎస్‌ లాసెట్‌ 2026కు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ ప్రక్రియ జులై 5 నుంచి ప్రారంభం అవుతుంది. జులై 10, 2026 వరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రాసెసింగ్‌ ఫీజుగా జనరల్‌/ ఓపెన్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. జులై 16 నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వీరికి జులై 24న సీట్లు కేటాయిస్తారు.

ఇక ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు జులై 27 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 1, 2వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. వీరికి ఆగస్ట్‌ 5న సీట్లు కేటాయిస్తారు. లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2026 కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..