AP Weather Report: దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్ వరకు విస్తరించి ఉంది. ఇది రాగాల12 గంటల్లో అండమాన్ సముద్రానికి చేరుతుంది. ఫలితంగా ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి బలపడి డిసెంబర్ 2వ తేదీకల్లా వాయుగుండంగా మారనుంది. మధ్య బంగాళా ఖతంలో డిసెంబర్ 3వ తేదీకల్లా బలపడి తుపాన్ గా మారుతుంది. ఇది తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరానికి 4వ తేదీకల్లా చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ప్రధానంగా పొడి వాతా వరణం ఉంటుంది. రేపు ప్రధానంగా పొడి వాతా వరణం ఉంటుంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చొట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
రాయలసీమ: ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.