AP Rains: బీ అలెర్ట్.! ఏపీని ఇంకా వీడని వానలు.. రాబోయే రెండు రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్. రాష్ట్రాన్ని ఇంకా వానలు వీడలేదు. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్. రాష్ట్రాన్ని ఇంకా వానలు వీడలేదు. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి.. ఇప్పుడు మరాతావాడ నుంచి దక్షిణ తమిళనాడు గుండా తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ/ నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని చెప్పారు.
రాబోయే రెండు రోజులకు వాతావరణ సూచనలు ఇవే:-
-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చు. అలాగే బలమైన గాలులు(గంటకు 30 -40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
-
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు(గంటకు 30 -40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:-
వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
-
రాయలసీమ:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.