Pulivendula Firing: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి బలి, మరొకరికి గాయాలు.. ఫైరింగ్ జరిపింది ఎవరో తెలుసా..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Mar 28, 2023 | 4:33 PM

ఈ ఇద్దరిపై కాల్పులు జరిపింది భరత్‌ కుమార్ యాదవ్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్‌ కుమార్ యాదవ్..

Pulivendula Firing: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి బలి, మరొకరికి గాయాలు.. ఫైరింగ్ జరిపింది ఎవరో తెలుసా..
Pulivendula
Follow us

కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేపుతోంది. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఇద్దరిపై కాల్పులు జరిపింది భరత్‌ కుమార్ యాదవ్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్‌ కుమార్ యాదవ్.. దిలీప్, మహబూబ్‌ బాషాపై కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. గాయపడిన ఇద్దరిని కడప రిమ్స్‌లో చికిత్స కోసం తరలించారు. అయితే, ఆర్థిక లావాదేవీలలో దిలీప్‌ పై భరత్‌ కుమార్‌ యాదవ్‌ మధ్య తేడా రావడంతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. సునీల్‌ యాదవ్‌ను వివేకాకి పరిచయం చేసింది భరతే అని.. కాల్పుల తర్వాత భరత్‌ కుమార్‌ యాదవ్‌ పరారీలో ఉన్నాడు.

ఓ స్థల వివాదంలో కాల్పులు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దిలీప్‌ను కడప రిమ్స్‌లో చికిత్స కోసం తరలించారు. అయితే, దిలీప్ యాదవ్ ఛాతిలో బుల్లెట్లు దిగడంతో వేంపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో గాయపడిన మస్తాన్‌కు చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దిలీప్‌, బాషాలపై మధ్యాహ్నం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక వివాదాల కారణంగానే భరత్‌ కాల్పులు జరిపినట్లుగా సమాచారం. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నభరత్‌ కుమార్ యాదవ్‌‌ను పులివెందుల పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులలోని పూల అంగళ్ల సమీపంలో కాల్పులు జరిపాడు భరత్ కుమార్ యాదవ్. ముందుగా స్థల వివాదంలో గన్‌తో బెదిరించినందుకు గతంలోనే భరత్‌పై కేసులు నమోదయ్యాయి. భరత్‌ యాదవ్‌ లైసెన్స్డ్‌ రివాల్వర్‌ అప్పుడే ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. 2 వారాల క్రితమే గన్‌తో బెదిరింపులకు దిగాడు. ఇవాళ కాల్పుల ఘటనతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ ఘటనా స్థలంలో సాక్షుల్ని విచారిస్తున్నారు పోలీసులు.

కాల్పులకు కారణం ఇదే..

ఓ స్థలం విషయంలో వివాదం దిలీప్‌-భరత్‌ కుమార్ యాదవ్ మధ్య కొంత కాలంగా వివాదం రాజుకోంటోంది. స్థానిక పెద్దలు సెటిల్మెంట్‌కి ప్రయత్నించినా రాజీ కుదరలేదని సమాచారం.  2 వారాల క్రితం దిలీప్‌ను గన్‌తో బెదిరించాడు భరత్.. అయితే,కేసు నమోదు చేసిన పోలీసులు భరత్‌ కుమార్ యాదవ్ నుంచి గన్‌ స్వాధీనం చేసుకోలేదని పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటున్నారు స్థానికులు. ఏ గన్‌తో బెదిరిపులకు దిగాడో అదే లైసెన్స్డ్‌ గన్‌తో ఇవాళ భరత్‌ కుమార్ యాదవ్ కాల్పులు జరిపాడాని తెలుస్తోంది. మాట్లాడుకుందామంటూ దిలీప్‌ను పిలిచిన భరత్‌.. కాల్పులు జరిపాడు. అత్యంత సమీపం నుంచి భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరిపడంతో దిలీప్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

భరత్‌ యాదవ్‌ ఎవరు..?

పులివెందలలో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తిగా భరత్‌ యాదవ్‌కు పేరుంది. YS వివేకానందా రెడ్డి హత్యా కేసులో CBI అధికారులు భరత్‌ యాదవ్‌ను ప్రశ్నించారు. హత్యా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ యాదవ్‌ను వివేకానందారెడ్డికి పరిచయం చేసింది భరత్‌ యాదవేనని సమాచారం. వివేకా హత్యా కేసులో సునీల్‌ యాదవ్‌ A2గా ఉన్నాడు. అదే సమయంలో వివేకా హత్యా కేసులో తనను ఇరికించారని భరత్‌ యాదవ్‌ సీబీఐ అధికారులపై ఆరోపణలు కూడా చేశారు. సునీల్‌ యాదవ్‌కు భరత్‌ సన్నిహిత బంధువు. వివేకానందరెడ్డి హత్యకు వివాహేతర సంబంధాలు, సెటిల్మెంట్లే కారణమని తరచూ మీడియా మందుకు వచ్చి చెబుతూ ఉండే వ్యక్తి భరత్‌ యాదవ్‌. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని మీడియా సమావేశాల్లోనూ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్ భయపెడుతున్నారని, ప్రలోభ పెడుతున్నారని సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu