AP Weather Alert: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడితో అప్రమత్తమైన అధికారులు

AP Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోనూ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళఖాతాలంలో ఏర్పడిన అల్పపీడనం..

AP Weather Alert: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడితో అప్రమత్తమైన అధికారులు
Andhra Weather Report
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2022 | 8:31 AM

AP Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోనూ వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళఖాతాలంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురియగా, శని, ఆదివారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణాతో పాటు తదితర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.

వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురియనున్నందున ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నారు.

ఇక తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం అయిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, భారీ వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతుండడంతోనే తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా రానున్న 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా తీరాలకు దగ్గరలోఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్