YS Jagan Mohan Reddy: 99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చాం.. – వైఎస్ జగన్

|

May 08, 2024 | 8:28 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీవీ9 ఇంటర్వ్యూపై సూపర్ బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఐదేళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకు సీఎం జగన్‌ రావడంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. టర్వ్యూ అన్ని అంశాలపై సూటి ప్రశ్నలు.. స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు జగన్.

YS Jagan Mohan Reddy: 99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చాం.. - వైఎస్ జగన్
Ys Jagan In Tv9 Interview
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీవీ9 ఇంటర్వ్యూపై సూపర్ బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఐదేళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకు సీఎం జగన్‌ రావడంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వైఎస్‌ జగన్‌ ఆన్‌ టీవీ9 హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతోంది. ఇంటర్వ్యూ అన్ని అంశాలపై సూటి ప్రశ్నలు.. స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు జగన్.

జగన్‌ హయాంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు సీఎం జగన్. గత 59 నెలల్లో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి ప్రజలకు పరిపాలనను చేరువ చేశామని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతి హామీకి పరిష్కారాలు వెతుకుతూ అమల్లోకి తెచ్చామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చామన్నారు. ప్రతి ఏటా మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాం. మ్యాన్‌మేడ్‌ సమస్యలకు పరిష్కారం మా 59 నెలల పరిపాలన అన్న జగన్, అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయికి పథకాలు తీసుకెళ్లామన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, కొత్తగా నిర్మిస్తున్న ఓడ రేవులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి అభివృద్ధి కాదా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 33 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. వైసీపీ హయాంలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాలు ప్రజలు ఆలోచించాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…