Watch Video: నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. బైకర్ చేసిన ఆ తప్పుడు పనికి 3 ప్రాణాలు బలి! వీడియో వైరల్
Nellore Road Accident: రహదారులపై నిత్యం ప్రమాదాల్లో భారీ వాహనాల అతివేగం అనేక సందర్భాలలో కారణాలుగా చూస్తుంటాం. నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టూవీలర్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర నిర్లక్ష్యం ముగ్గురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే తప్పు పూర్తిగా లారీ డ్రైవర్ దే అనుకున్నారంతా.. కానీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు చూసిన పోలీసులు ప్రమాదానికి గల కారణం గుర్తించారు..

నెల్లూరు, నవంబర్ 12: ద్విచక్ర వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయి. జాతీయ రహదారులపై సడన్ గా రోడ్ క్రాస్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. వారితో పాటు జాగ్రతగా డ్రైవింగ్ చేస్తున్న వారి ప్రాణాలు గాలిలొ కలుస్తున్నాయి. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కూడా ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యమే కారణమని తేలింది. రహదారుల వెంబడి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ.. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి కొన్నిసార్లు మానవ తప్పిదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం కూడా అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. సూళ్లూరుపేటలో చేపలను అన్లోడ్ చేసుకున్న కంటైనర్ లారీ నెల్లూరుకు బయల్దేరింది. ఎన్టీఆర్ నగర్ సమీపానికి రాగానే.. పద్మావతి గ్రీన్ సిటీ నుంచి ఓ బైక్ సడన్ గా కావలి వైపు యూటర్న్ తీసుకుంది. మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్ డ్రైవర్.. బైక్ను తప్పించబోయి వేగాన్ని నియంత్రించలేకపోయాడు.
కొన్ని క్షణాలు టూ వీలర్.. కంటైనర్ ప్రయాణ సమయం తేడాగా ఉండి ఉంటే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఇంటికి వెళ్లి పోయేవారు. వేగాన్ని అదుపు చేసుకో లేకపోయినా కంటైనర్ లారి.. బైక్‌లతో పాటు ముందు వెళ్తున్న మరో బైక్ ను డీ కొట్టింది. అంతటితో ఆగకుండా కంకులు, టెంకాయలు అమ్ముకునే వారి మీదకు దూసుకెళ్లింది.. ఆ పై చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సిరి గార్డెన్ కి చెందిన నాజిం మొహిద్దిన్, మొహజీద్ తో పాటు సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. యూటర్న్ తీసుకున్న బైకర్ కోటేశ్వర రావ్, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన సురేష్ బార్య ఎనిమిదో నెల గర్భిణీ. అలాగే తండ్రి కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంతా ఒక బైకర్ నిర్లక్ష్యంగా రోడ్డు మీదకు వచ్చి వాహనాలను గమనించకుండా యూటర్న్ తీసుకోవడమే కారణం.
జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. హైవే లో నడి రోడ్డులో బైక్ నడుపుతూ.. వెనుక వచ్చే వాహనాలకు దారి ఇవ్వకపోవడం, సడన్ గా యూటర్న్ లు తీసుకోవడమే ఘోర రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారాయి. సంఘం మండలం పెరమణా జాతీయ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కనబడింది. కోవూరు సమీపంలో కూడా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద సీసీటీవీ దృశ్యాలు కూడా వాహనదారుడు తప్పిదం వల్లే జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ నగర్ హైవే వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు.. క్రాసింగ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కంటైనర్ లారీలను గుర్తించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
చెన్నై టు విజయవాడ జాతీయ రహదారిని విస్తరించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చింతా రెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. చింతా రెడ్డిపాలెం నుంచి నెల్లూరు టౌన్ లోకి వెళ్లేవారు.. టౌన్ నుంచి చింతా రెడ్డిపాలెం వెళ్లేందుకు పాదాచార్యులు వాహనదారులు రోడ్డు క్రాస్ చేస్తూ ప్రమాదాలకి గురవుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలంటూ ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి వెళ్లాయి. మరోపక్క చెన్నై విజయవాడ జాతీయ రహదారిని రోడ్డు విస్తరించడంతోపాటు 6 లైన్స్ రోడ్డుగా ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ.. ట్రాఫిక్ నిబంధనలు తెలియకుండా.. జాతీయ రహదారిపై వాహనాలు నడుపుతున్న వారిని నియంత్రిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




