Andhra Politics: జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ.. ఏపీ రాజకీయాల్లో పేలుతున్న మాటల తూటాలు..

|

Aug 14, 2023 | 9:24 AM

ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి.. జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వారాహి మూడో విడత యాత్రలో పవన్‌ కల్యాణ్‌ పంచ్‌ డైలాగులతో అధికార పార్టీని సవాల్‌ చేస్తున్నారు. సంకీర్ణం వచ్చినా పర్లేదు.. కానీ వైసీపీ రాకూడదు.. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ముఖ్యమంత్రినే విభేదించాను. అసలు వాలంటీర్లకు హెడ్‌ ఎవరు..

Andhra Politics: జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ.. ఏపీ రాజకీయాల్లో పేలుతున్న మాటల తూటాలు..
Ycp Vs Jsp
Follow us on

ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి.. జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వారాహి మూడో విడత యాత్రలో పవన్‌ కల్యాణ్‌ పంచ్‌ డైలాగులతో అధికార పార్టీని సవాల్‌ చేస్తున్నారు. సంకీర్ణం వచ్చినా పర్లేదు.. కానీ వైసీపీ రాకూడదు.. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ముఖ్యమంత్రినే విభేదించాను. అసలు వాలంటీర్లకు హెడ్‌ ఎవరు.. గాజువాకలో జనసేన జెండా ఈసారి ఎగిరితీరుతుందని పక్కాగా చెప్పారు. పోటెత్తిన జనసంద్రం మధ్య జనసేనాని..నిప్పులు చెరిగారు..సీఎం జగన్‌ ఉండేది ఇక కేవలం ఆరు నెలలేనని పవర్‌ ఫుల్‌ జోష్‌తో మాట్లాడారు. పవన్‌ మాట్లాడిన వెంటనే.. వైసీపీ మంత్రులు క్యూలో కౌంటర్లు వేశారు.

విశాఖలో మూడో వారాహి విజయయాత్ర సంచలనం రేపుతోంది..పబ్లిక్‌ మీటింగుల్లో పవర్‌ ఫుల్‌ జోష్‌తో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌.. అధికార పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు ఉమెన్‌ ట్రాఫికింగ్‌.. ఇప్పుడు దండుపాళ్యం గ్యాంగ్‌.. రేపేంటి.. అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

విశాఖ తీరంలో పవన్‌ సృష్టించిన పొలిటికల్‌ తుఫాన్‌ స్టేట్‌ మొత్తం కల్లోలం రేపుతోంది. జగన్‌ ప్రభుత్వం, వాలంటీర్లు టార్గెట్‌గా పవన్‌ చేసిన దండుపాళ్యం కామెంట్స్‌ రాజకీయ సునామీ సృష్టిస్తున్నాయ్‌..అంతేకాదు.. 2024లో తమ జెండా ఎగరడం ఖాయమంటున్నారు.. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కూడా పవన్‌ పంచ్‌ డైలాగులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూనే.. తాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రధాని మోడీతో విబేధించానన్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్‌ను కూడా పవన్‌ కల్యాణ్‌ వదల్లేదు.. ఇక ఆర్నెళ్లు మాత్రమే టైమ్‌ బ్రో అన్నారు. రుషికొండలో నిర్మాణాల గురించి పవన్‌ సరికొత్త నిర్వచనం చెప్పారు. రుషికొండపై దేవుడు ఉండాలంటూ కౌంటర్ వేశారు. మరి తమ ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వాన్ని, తమ పార్టీని ఇన్నిమాటలన్న పవన్‌ను..వైసీపీ నేతలు వదులుతారా..అంతకుమించిన హాట్‌ హాట్‌ కామెంట్స్‌తో పవన్‌ను సెంటర్‌ పాయింట్‌ చేసి కౌంటర్‌ అటాక్‌ ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కంటే దండుపాళ్యం బ్యాచ్‌, స్టూవర్టుపురం దొంగలు ఇంకెవరైనా ఉన్నారా అంటున్నారు మంత్రులు.

పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు, మల్లాది విష్ణు కూడా విరుచుకుపడ్డారు. చంద్రబాబు సీఎం కావడమే పవన్ లక్ష్యమని అందుకే.. ఆయన అలా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఇది ఏపీలో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న రాజకీయం.. వారాహి మూడో విడత యాత్రలో పవన్‌ కల్యాణ్ బుల్లెట్‌ లాంటి డైలాగులతో దూసుకుపోతున్నారు. మరి అదే దూడుకు ఎన్నికల వరకు ఉంటుందా అని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు థింక్‌ థింక్‌ చేస్తున్నారట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..