Palamaneru Politics: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి.. రంజుగా మారిన పలమనేరు రాజకీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. పలమనేరులో పాలిటిక్స్ రోడ్డెక్కాయి. రోడ్లకోసమే.. రచ్చ జరుగుతోందక్కడ. ఒకరు ఎమ్మెల్యే. ఇంకొరు మాజీ మంత్రి. ఇంకేముంది... రాజకీయం.. యమా రంజుగా మారింది. నువ్వెంతంటే నువ్వెంత.. అంటూ... సవాళ్లు, ప్రతిసవాల్లు విసురుకుంటున్నాయి రెండు వర్గాలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. పలమనేరులో పాలిటిక్స్ రోడ్డెక్కాయి. రోడ్లకోసమే.. రచ్చ జరుగుతోందక్కడ. ఒకరు ఎమ్మెల్యే. ఇంకొరు మాజీ మంత్రి. ఇంకేముంది… రాజకీయం.. యమా రంజుగా మారింది. నువ్వెంతంటే నువ్వెంత.. అంటూ… సవాళ్లు, ప్రతిసవాల్లు విసురుకుంటున్నాయి రెండు వర్గాలు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే మంజూరైన రోడ్లు.. ఇప్పటివరకు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే వెంకటే గౌడ, మాజీ మంత్రి అమన్నాథరెడ్డి.. పరస్పరం సవాళ్లు విసురుకోవడం రచ్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు అమర్నాథరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే 87 రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేశారు. అయితే, ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడింది. దీంతో, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ రోడ్లు దారుణంగా మారిపోయాయి.
గతంలో అమర్నాథరెడ్డి బినామీ కంపెనీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ టెండరు దక్కించుకుని, రోడ్డు పనులు మధ్యలోనే ఆపేసిందని ఆరోంంచారు ఎమ్మెల్యే వెంకటే గౌడ. తాజాగా మరోసారి ఇద్దరి పంచాయితీ ముదుతోంది. పలమనేరు అభివృద్ధిపై ఎమ్మెల్యే వెంకటే గౌడ, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పలమనేరు అభివృద్ధిపై ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నియోజక వర్గం హాట్ టాపిక్ అయ్యింది. అభివృద్ధి అంతా తనదేనని ఆధారాలతో నిరూపిస్తానంటున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటే గౌడ దమ్ముంటే చర్చకు రావాలని మీసం మెలేసి సవాల్ విసురుతున్నారు.
చేసిన అభివృద్ధిని ఆధారాలతో చూపేందుకు సిద్ధమంటున్నారు అమర్. నియోజకవర్గంలోన గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న అమర్ చేసిన సవాల్ ను స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడ చర్చకు సిద్ధమయ్యారు. డేట్, టైం, ప్లేస్ ఫిక్స్ చేసి చెబితే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడ. గత ప్రభుత్వ హయంలో పలమనేరు అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసిరారు. చర్చకు అమర్నాథ్ రెడ్డి టైం డేట్ ఫిక్స్ చేయకపోతే తానే తేదీ స్థలం ఖరారు చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడ కామెంట్స్ ఇప్పుడు పలమనేరు పాలిటిక్స్ లో రచ్చగా మారాయి.
ఈ సవాళ్లు ప్రతిసవాళ్లు తర్వాత…. ముందుగా అభివృద్ధిని పట్టించుకోండి బాబోయ్ అంటున్నారు స్థానిక జనం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.