Vande Bharat: రైల్వేలు జాతీయ సంపద.. వాటిపై దాడి చేస్తే కఠిన చర్యలు.. వాల్తేరు డివిజన్ మేనేజర్ స్ట్రాంగ్ వార్నింగ్..

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై ఖమ్మంలో జరిగిన రాళ్ల దాడిపై వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజర్ అనూప్ సత్పతి స్పందించారు. రాళ్ళ దాడి వంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ సంపద అయిన రైల్వే పై దాడులు..

Vande Bharat: రైల్వేలు జాతీయ సంపద.. వాటిపై దాడి చేస్తే కఠిన చర్యలు.. వాల్తేరు డివిజన్ మేనేజర్ స్ట్రాంగ్ వార్నింగ్..
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు మాదిరిగానే.. సికింద్రాబాద్ టూ తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు కూడా ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందట. ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
Follow us

|

Updated on: Feb 04, 2023 | 9:53 PM

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై ఖమ్మంలో జరిగిన రాళ్ల దాడిపై వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజర్ అనూప్ సత్పతి స్పందించారు. రాళ్ళ దాడి వంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ సంపద అయిన రైల్వే పై దాడులు చేసేవారిని వదిలిపెట్టమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం సమీపంలో వందే భారత్ పై రాళ్ల దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు ట్రైన్ కే అమర్చిన సీసీ కెమెరాల ద్వారా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. నిన్నటి ఘటనతో పగిలిన గ్లాస్ స్థానం లో కొత్త గ్లాసు ను ఏర్పాటు చేయడం వల్ల మూడు గంటలు ఆలస్యంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది.

కాగా.. ఖమ్మం జిల్లాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి జరిగింది. రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పందిల్లపల్లి స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. నిన్న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే సమాచారం అందుకున్న ఖమ్మం రైల్వే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. విచారణ చేస్తున్నారు. ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది.

మరోవైపు.. నగరాల మధ్య ప్రజలకు సులభమైన ప్రయాణం అందించేందుకు తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లపై దాడులు జరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నం కంచరపాలెంలో జరిగిన ఘటనను మరవకముందే ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనే జరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..