Minister Roja: పేదలకు ఇచ్చే స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడంపై మంత్రి రోజా ఆగ్రహం.. నెక్స్ట్ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని జోస్యం..

|

May 20, 2023 | 7:29 AM

తిరుపతి వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి రోజా. వాలంటీర్ల సేవలను కొనియాడిన రోజా.. చంద్రబాబు సెంటు భూమి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధులతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి రోజా.

Minister Roja: పేదలకు ఇచ్చే స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడంపై మంత్రి రోజా ఆగ్రహం.. నెక్స్ట్ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని జోస్యం..
Minister Roja
Follow us on

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా.. పలువురు వాలంటీర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని చెప్పారు. మరోవైపు.. అమరావతిలో పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి రోజా.

ఇక.. వాలంటీర్లు సంక్షేమ సేవకులని.. వారి సేవలు వెలకట్టలేనివన్నారు రోజా. వాలంటీర్‌ వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్‌ వ్యవస్థతో సరికొత్త మార్పు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు మంత్రి రోజా.

జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని, వరుసగా మూడో సంవత్సరం నిర్వహిస్తున్న వందనం సన్మాన కార్యక్రమం నిర్వహణలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. ప్రతినెలా 1వ తేదీ సూర్యోదయానికి ముందే ఇంటి ముంగిటకు వెళ్లి తాతయ్యలకు, ఇతర అర్హులకు పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. జగనన్నకు మంచి పేరు తీసుకురావడానికి మీరు కృషి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని, సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్న నిజమైన నాయకుడన్నారు మంత్రి రోజా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..