Andhra: కాటికి పోయే వయసులో ఇదేం పనిరా.. మనుమరాలిపై తాత అఘాయిత్యం.. చివరకు..
విజయనగరం జిల్లా గాజులరేగలో చోటుచేసుకున్న అమానుష ఘటన పై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. తన సొంత మనవరాలిపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాకుండా ఐదు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.

విజయనగరం జిల్లా గాజులరేగలో చోటుచేసుకున్న అమానుష ఘటన పై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. తన సొంత మనవరాలిపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాకుండా ఐదు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది. బాధిత బాలిక పునరావాసం కోసం ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆగస్టు 18, 2025న వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పెద్దలు లేని సమయంలో అభం శుభం తెలియని అమాయక బాలిక పై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు నిందితుడు సత్యారావు..
అనంతరం కొంత సేపటికి బాలిక తల్లి ఇంటికి వచ్చి పరిస్థితి గమనించి బాలికను ఆరా తీసింది. దీంతో తన తాత సత్యారావు మృగంలా మారి చేసిన అఘాయిత్యం గురించి.. బాలిక తెలిసి తెలియని మాటలతో తల్లికి తెలియజేసింది. దీంతో వెంటనే నిందితుని పై బాలిక తల్లి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా పోలీసు స్టేషన్ ఎస్ ఐ జి. శిరీష పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, డిఎస్పీ ఆర్. గోవిందరావు పర్యవేక్షణలో దర్యాప్తు పూర్తి చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
కేసుకు సంబంధించి కోర్టులో ఫోక్సో న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానా రావు బలమైన వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా బాలల పై జరిగే నేరాలకు కఠిన హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు. నిందితుల పై చర్యలు తీసుకోవడమే కాకుండా చిన్నారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
