AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క కార్డు ఉంటే బస్సుల్లో రాయితీ, రైళ్లల్లో ప్రత్యేక బెర్త్‌లు.. ప్రయోజనాలు ఇంకెన్నో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు వివిధ పథకాలు పొందేందుకు అనేక గుర్తింపు పత్రాలను జారీ చేస్తూ ఉంటాయి. ఆధార్ కార్డు ఉన్నా. . ధృవీకరణ కోసం మరిన్ని పత్రాలు అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా 60 ఏళ్లు దాటిన వృద్దులకు సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు చేస్తారు.

ఈ ఒక్క కార్డు ఉంటే బస్సుల్లో రాయితీ, రైళ్లల్లో ప్రత్యేక బెర్త్‌లు.. ప్రయోజనాలు ఇంకెన్నో..
Senior Citizen Card
Venkatrao Lella
|

Updated on: Dec 08, 2025 | 6:58 PM

Share

Senior Citizen Card: వయస్సు ధృవీకరణకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండకనే ఉంది. ఇక అడ్రస్, పేరు, ఇతర వివరాల ధృవీకరణకు ఆధార్ కార్డు ఎలానూ ఉంది. మన ఆదాయ ధృవీకరణకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక కుల ధృవీకరణ పత్రం లాంటివి చాలానే ఉన్నాయి. ఇక 60 ఏళ్ల వయస్సు దాటిన వారిని భారత్‌లో సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. మరి సీనియర్ సిటిజన్ల ధృవీకరణకు కూడా ఒక సర్టిఫికేట్ ఉంది. అదే సీనియర్ సిటిజన్ కార్డు. ఈ కార్డు కలిగి ఉండటం వల్ల ప్రభుత్వ పథకాల పరంగానే కాకుండా ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కార్డు ఎలా తీసుకోవాలి..? ఎక్కడ తీసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.

సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే..

సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. బస్సు టికెట్లపై రాయితీ, వృద్దులకు ప్రత్యేకంగా బస్సుల్లో సీటు రిజర్వ్, రైళ్లల్లో లోయర్ బెర్త్‌ల కేటాయింపు, రిజర్వ్ బెర్త్‌లు, పాస్‌పోర్టు స్లాట్‌ బుక్‌ ఫీజులో 10 శాతం తగ్గింపు , బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లకు అధిక వడ్డీ,  రూ.3 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు, పెన్షన్, సీనియర్ సిటిజన్ల కేసులు త్వరతగతిన విచారణ వంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని మీరు సులువుగా పొందటంతో సీనియర్ సిటిజన్ కార్డు బాగా ఉపయోగపడుతుంది.

ఉచితంగా కార్డు పొందటం ఎలా..?

ఈ కార్డును 60 ఏళ్లు దాటిన వృద్దులు ఉచితంగానే పొందవచ్చు. ఏపీలో అయితే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లేదా జిల్లా వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుల కార్యాలయానికి వెళ్లి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జిల్లా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వెంటనే కార్డు మంజూరు చేస్తారు. ఇక తెలంగాణలో అయితే జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కార్డు పొందితే దేశవ్యాప్తంగా ఇది చెల్లుబాటు అవుతుంది.

ఇవి సమర్పించాల్సిందే

సీనియర్ సిటిజన్ కార్డు పొందటానికి దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అందించాల్సి ఉంటుంది. వీటిని ధృవీకరించిన అనంతరం సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు చేస్తారు.

ఆన్‌లైన్ వెబ్‌సైట్లు

ఏపీవాసులు https://apdascac.ap.gov.in/, తెలంగాణ ప్రజలు https://tgseniorcitizens.cgg.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా సీనియర్ సిటిజన్ల సేవలకు సంబంధించిన వివరాలను పొందవచ్చు. వృద్దులకు అందించే సేవలు, పథకాలు, ఇతర విషయాలు వీటి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?