AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: భార్య మరణాన్ని భరించలేక ఆమె వర్ధంతి రోజే భర్త ఆత్మహత్య!

భార్యపై అనుమానంతో భర్త, భర్తపై అనుమానంతో భార్యలు ఒకరినొకరు చంపుకుంటున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తున్నాం. కానీ ఇక్కడో భర్త మాత్రం.. భార్య చనిపోయిందనే బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె మరణించిన తేది రోజే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: భార్య మరణాన్ని భరించలేక ఆమె వర్ధంతి రోజే భర్త ఆత్మహత్య!
Man Ends Life On Wifes Death Anniversary
Anand T
|

Updated on: Oct 26, 2026 | 7:37 AM

Share

భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. భార్య చనిపోయిన తేదీ నాడే భర్త కూడా ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.వివరాల్లోకి వెళ్తే.. బూడిపేటకు చెందిన దూళి లక్ష్మణరావు, గౌరి అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విశాఖపట్నంలోని మధురవాడలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబంతో కలిసి సంతోషంగా సాగుతున్న లక్ష్మణరావు జీవితంలో అకస్మాత్తుగా విషాదం అలుముకుంది.

సుమారు ఏడాది క్రితం లక్ష్మణరావు భార్య గౌరి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో లక్ష్మణరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో ఉన్న అనుబంధం, ఆమె లేని లోటు ఆయనను మానసికంగా కుంగదీశాయి. భార్య మరణించినప్పటి నుంచి తీవ్ర ఆవేదనతో ఉన్న లక్ష్మణరావు, సరిగ్గా ఆమె మృతి చెందిన తేదీ నాడే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

దీనికోసం స్వగ్రామానికి చేరుకున్న లక్ష్మణరావు, గ్రామస్తులతో కలిసి కొంతసేపు సరదాగా గడిపాడు. అనంతరం గంట్యాడ మండలం కొర్లాం సమీపంలోని నేలబావి వద్దకు వెళ్లి, అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరూ దూరం కావడంతో ఆ చిన్నారి కుమార్తె పరిస్థితిని తలచుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు. భార్య చనిపోయిన రోజునే భర్త కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, చర్చనీయాంశాన్ని మిగిల్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us