Jagan on Vizag: వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారు.. నెక్ట్స్ సీఎంగా ఇక్కడే ప్రమాణస్వీకారంః జగన్

హైదరాబాద్‌లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం దురదృష్టమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల వచ్చే పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్‌, బెంగళూరుతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో విజన్‌విశాఖను రూపొందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజల పట్ల ఉన్న నా నిబద్ధతకు […]

Jagan on Vizag: వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారు.. నెక్ట్స్ సీఎంగా ఇక్కడే ప్రమాణస్వీకారంః జగన్
Jagan On Vizag
Follow us
Balaraju Goud

|

Updated on: May 08, 2024 | 9:34 PM

హైదరాబాద్‌లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం దురదృష్టమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల వచ్చే పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్‌, బెంగళూరుతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో విజన్‌విశాఖను రూపొందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజల పట్ల ఉన్న నా నిబద్ధతకు ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకర కాకుండా తాను అడ్డుకోవడం వల్లే ఆగిందని సీఎం జగన్ గుర్తు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని పునరుద్ఘాటించిన జగన్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి విశాఖ నుండి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఉన్నన్ని మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు. గతంలో చూడని ఐకానిక్‌ కన్వెన్షన్‌ హాల్, స్టేడియం, సెక్రటేరియట్‌ విశాఖలో కట్టాలని నా ఆలోచన అని జగన్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…