Andhra Pradesh: మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల వినూత్న నిరసన.. కొండ పైకి ఎక్కి మెడకు ఉరితాళ్లు బిగించుకుని..
Visakhapatnam: విశాఖ అనకాపల్లి జిల్లాలో మైనింగ్‌కి వ్యతిరేకంగా మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తవ్వకాలకు అనుమతులు ఇస్తే ఉరే సరి అంటూ నినదించారు. మెడకు ఉరితాడు పెట్టుకొని ప్రదర్శన చేపట్టారు.
Visakhapatnam: విశాఖ అనకాపల్లి జిల్లాలో మైనింగ్‌కి వ్యతిరేకంగా మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తవ్వకాలకు అనుమతులు ఇస్తే ఉరే సరి అంటూ నినదించారు. మెడకు ఉరితాడు పెట్టుకొని ప్రదర్శన చేపట్టారు. అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలంలోని దాలివలస, గవరపాలెం, పిండ్రంగి, మర్రివలస గ్రామాల్లో మైనింగ్ తవ్వకాలపై స్థానికులు ఉద్యమబాట పట్టారు. తవ్వకాలను వ్యతిరేకిస్తూ.. అవి ఆపకుంటే ఉరే శరణ్యమని నినదించారు. నాలుగు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు కొండపైకి ఎక్కి మెడకు ఉరితాళ్లు వేసుకోని నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు సీఎఎం నాయకులు మద్దతిచ్చారు. ఇప్పటికే కొండలను సగం పిండిచేసేశారని ఆరోపించారు నేతలు. లీజు కాలం ముగియడంతో మిగిలిన కొండలను కరిగించేయడానికి లీజుదారులు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు.
ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా.. మైనింగ్ అనుమతులు తీసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. అదే జరిగితే పరిసర ప్రాంతవాసుల నోట్లో మట్టికొట్టినట్టేనని అన్నారు. స్థానికుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్తే ఉరి వేసుకోవడం మినహా మరేం ఉండదన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఆలోచించుకోవాలని.. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.