రెండు లారీలు ఢీ.. డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం గుడివాడ జంక్షన్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో వెంటనే లారీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేస్తున్నారు. మృతులు రామ్‌సుందర్ యాదవ్, ఓంప్రకాశ్‌సింగ్‌గా గుర్తించారు. కెమికల్ లోడుతో ఉన్న లారీ కావడంతో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు […]
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం గుడివాడ జంక్షన్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో వెంటనే లారీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేస్తున్నారు. మృతులు రామ్‌సుందర్ యాదవ్, ఓంప్రకాశ్‌సింగ్‌గా గుర్తించారు. కెమికల్ లోడుతో ఉన్న లారీ కావడంతో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.