ఆమ్మో గ్యాస్ బాంబ్..! జనావాసాల ఫిల్లింగ్.. డొమెస్టిక్ టు కమర్షియల్ ఇల్లీగల్ దందా..! మీ సిలిండర్లో గ్యాస్ ఉందా..?!
Visakhapatnam: ధర నానాటికి పెరుగుతున్న.. మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సరే.. గ్యాస్ సిలిండర్ను తెచ్చుకోవాల్సిందే..! ఎందుకంటే కిచెన్ లో అంత ప్రాముఖ్యత చోటుచేసుకుంది గ్యాస్ సిలిండర్. మరి దీన్నే ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ముఠాలు.. గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ ను చోరీ చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా జనం జేబు..

వైజాగ్, ఆగస్టు 2: ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది నిత్యవసరంగా మారింది. కట్టెల పొయ్యి కాలం పోయిన తర్వాత.. సిలిండర్ లేనిదే వంటింట్లో ఎవరు అడుగు పెట్టేందుకు ఇష్టపడరు. ధర నానాటికి పెరుగుతున్న.. మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సరే.. గ్యాస్ సిలిండర్ను తెచ్చుకోవాల్సిందే..! ఎందుకంటే కిచెన్ లో అంత ప్రాముఖ్యత చోటుచేసుకుంది గ్యాస్ సిలిండర్. మరి దీన్నే ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ముఠాలు.. గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ ను చోరీ చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా జనం జేబు కొల్లగొట్టేస్తున్నారు. ఎలా అనేగా ఈ మీ ఆలోచన..? డొమెస్టిక్ టు కమర్షియల్ గ్యాస్ ఇల్లీగల్ దందా ఎలా ఉందో తెలుసుకోండి మరి.
విశాఖ ఎంవిపి కాలనీలో ఓ చిన్న కర్రీ పాయింట్. బయటకు కనిపిస్తున్నది కర్రీ పాయింట్ బడ్డీ మాత్రమే. కానీ లోపల జరుగుతున్నది ఏంటో తెలుసా..? అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ దందా..! ఎస్.. ఎక్కడో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జరగాల్సిన తంతుని ఇల్లీగల్ గా జనావాసాల మధ్య చేసేస్తున్నారు. అది కూడా గ్యాస్ ను చోరీ చేసి మరో గ్యాస్ సిలిండర్ లో నింపుకొని అమ్ముకుంటున్నారు. విజిలెన్స్ అధికారుల దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పైకి సీల్ ఉంటుంది లోపల గ్యాస్ ఖాళీ అయిపోతుంది..!
ఎంవిపి కాలనీ విశాఖలో గ్యాస్ అనధికార ఫిల్లింగ్ కేంద్రంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఎంవీపీ కాలనీ సెక్టార్ 12లో కర్రీ పాయింట్ షాప్ మాటున గ్యాస్ ఫిల్లింగ్ సాగిపోతున్న వ్యవహారాన్ని బయటపెట్టారు. డొమెస్టిక్ సిలిండర్లనుంచి గ్యాస్ చోరీ చేసి కమర్షియల్ సిలిండర్లో ఫిల్ చేసి అమ్మేసుకుంటున్నారు. డొమెస్టిక్ సిలిండర్ లో నుంచి గ్యాస్ ఖాళీ చేసిన వాటిని అవసరమైన వారికి అమ్మేస్తున్నారు. డొమెస్టిక్ నుంచి గ్యాస్ ను తీసి కమర్షియల్ సిలిండర్ లో ఫీల్ చేసి.. వాటిని కూడా అమ్మేసి సొమ్ము చేసుకుంటుంది ముఠా. మళ్లీ యధావిధిగా ఎవరికి అనుమానం రాన్నట్టు కంపెనీ ట్రేడ్ మార్క్ సీల్ వేసి సరఫరా చేసేస్తున్నారు.




రెండు చేతుల సంపాదన..!
వాస్తవానికి డొమెస్టిక్ సిలిండర్ వెయ్యి రూపాయల పైగా ఉంది. అయితే జనాలకు వెళ్లాల్సిన ఆ డొమెస్టిక్ సిలిండర్లను కొందరు మధ్యవర్తుల సహకారంతో పక్కదారి పట్టిస్తున్నారు. వాటిని తీసుకువచ్చి.. ఒక్కో గ్యాస్ సిలిండర్ నుంచి రెండు నుంచి నాలుగు కిలోల వరకు గ్యాస్ ను బయటకు తీసేస్తున్నారు. వాటిని కమర్షియల్ సిలిండర్ లో నింపేసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్ 1750 రూపాయలకు అమ్ముకుంటుంది ముఠా. కమర్షియల్ సిలిండర్ అయితే భారీగా ధర పలుకుతుండడంతో.. డొమెస్టిక్ నుంచి చోరీ చేసిన గ్యాస్ ఇలా పక్కదారి పట్టించి రెండు చేతుల సంపాదిస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ కూడా సిద్ధం చేసుకున్నారు. విజిలెన్స్ సోదాల్లో 18 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు.
జనావాసాల మధ్యనే గ్యాస్ బాంబ్..!
ఎంవిపి కాలనీలో రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ ఒక కాలువ పక్కన కర్రీ పాయింట్ మాదిరిగా బడ్డీ పెట్టి అందులో ఈ ఇల్లీగల్ ఫిల్లింగ్ దందా సాగిపోతుంది. నిత్యం గ్యాస్ సిలిండల నుంచి గ్యాస్ను చోరీ చేసి పక్క సిలిండర్లో నింపేస్తున్నారు. ఎటువంటి సేఫ్టీ నామ్స్ పాటించకుండా.. కిలోల కొద్దీ గ్యాస్ ను లాగేస్తున్నారు. కాస్త అటు ఇటు అయిందో.. భారీ డేంజర్ తప్పదని అంటున్నారు విజిలెన్స్ సీఐ తిరుపతిరావు. దీంతో జనం హడలెత్తిపోతున్నారు. ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత.. దాని బరువు చెక్ చేసుకుంటే మంచిది. అంతేకాదు.. ఇలా ఇల్లీగల్ ఫిల్లింగ్ తో మీ గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ కూడా లికయ్యే ప్రమాదం ఉంది. బి అలర్ట్..!
