విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు

రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2020 | 7:52 PM

Swaroopanandendra Saraswati Swamy: రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారికి శ్రీవారి శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు చేపట్టిన చాతుర్మాస దీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇక టీటీడీ ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకొచ్చే యోచన ఆహ్వానించదగినదని స్వామి సరూపానందేంద్ర తెలిపారు. అలాగే గుడిగో గోవు కార్యక్రమం కూడా అభినందించదగ్గ విషయమని అన్నారు. టీటీడీ ధార్మిక నిర్ణయాలపై సాంప్రదాయ గురువులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భజన మండళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని.. వేంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రధాన నగరాలతో పాటు హరిజన, గిరిజన ప్రాంతాల్లోనూ నిర్మించాలని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

Read More:

బన్నీకి ‘రౌడీ’ స్పెషల్ గిఫ్ట్‌.. థ్యాంక్స్ చెప్పిన స్టైలిష్ స్టార్‌

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు