రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు
ముందుకన్నా నాణ్యమైన విద్యుత్‌ని రైతులకు అందించేందుకు కొత్త మీటర్లను బిగించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని అన్నారు.
Minister Perni Nani: ముందుకన్నా నాణ్యమైన విద్యుత్‌ని రైతులకు అందించేందుకు కొత్త మీటర్లను బిగించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని అన్నారు. మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ వినియోగం వివరాలు తెలుస్తాయని, దాని వలన సరఫరా ఎంత అవసరం అన్నది అంచనా వేయొచ్చని ఆయన తెలిపారు. ఈ మీటర్ల ఏర్పాటుతో నష్టం ఉండదని స్పష్టం చేశారు. రైతులకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా దానిపై పరిమితులు ఉండవని మంత్రి వివరించారు. రైతులకు ఎంత అవసరమో అంతా వాడుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యం ఉందో, అదే ఇకపై కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎంత విద్యుత్ వాడుతున్నారో తెలిస్తే దాన్ని బట్టి ఆయా ట్రాన్స్‌ఫార్మర్, సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త మీటర్లు ఉపయోగపడుతాయని మంత్రి నాని పేర్కొన్నారు.
Read More:
ఆటోమొబైల్ రంగానికి గుడ్‌న్యూస్ చెప్పిన నితిన్ గడ్కరీ