AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రిగారు అంతర్వేదిలో ఏం జరిగింది…

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని ప్రఖ్యాతి గాంచిన అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని రథం అగ్నికి ఆహుతి కావటం...

ముఖ్యమంత్రిగారు అంతర్వేదిలో ఏం జరిగింది...
Sanjay Kasula
|

Updated on: Sep 06, 2020 | 8:45 PM

Share

Somu Veerraju : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని ప్రఖ్యాతి గాంచిన అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని రథం అగ్నికి ఆహుతి కావటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏటా జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల సమయంలో స్వామి వారి రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రల నుంచి అంతర్వేది ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారని లేఖలో రాసుకొచ్చారు. తరతరాలుగా ఈ రథోత్సవానికి గల ప్రాధాన్యతను గుర్తించిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు 1958లో ఈ భారీ రథాన్ని తయారు చేయించారని పేర్కొన్నారు.

గత 62 సంవత్సరాలుగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో ఈ రథం తరిస్తోందన్నారు. అటువంటి రథం దగ్ధం కావడం లక్షలాది మంది భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలు దెబ్బ తినే రీతిలో రథం దగ్ధం అయ్యిందని లేఖలో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ దగ్ధం అయ్యిందా? లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారా అనేది స్పష్టం కావలసి ఉందన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలనీ, శాఖాపరమైన శాఖాపరమైన నిర్లక్ష్యమైతే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా సూచించారు.