దారుణం..! అనాథాశ్రమంలో ఫుడ్‌పాయిజన్.. ముగ్గురు చిన్నారులు మృతి
చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని, జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రయంలో సమోసా తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని, జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..