AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగుపాము vs రక్తపింజర ఎదురుపడితే..? ఎవరిది పైచేయి.. భీకర పోరాటమేనా..?

నాగుపాము, రక్తపింజర (రస్సెల్స్ వైపర్) ఎదురుపడితే భీకరంగా పోరాడతాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రకృతిలో అలాంటి ఘర్షణలు చాలా అరుదు. ప్రమాదాన్ని తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవడానికే ఈ రెండు విషపూరిత పాములు ఎక్కువగా ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరంగా తెలుసకుందాం పదండి ..

నాగుపాము vs రక్తపింజర ఎదురుపడితే..? ఎవరిది పైచేయి.. భీకర పోరాటమేనా..?
Cobra Vs Russell's Viper
Ram Naramaneni
|

Updated on: Aug 03, 2026 | 4:16 PM

Share

అడవిలోనో.. పొలంలోనో.. వర్షాకాలంలో గ్రామాల సమీపంలోనో ఒకేసారి నాగుపాము, రక్తపింజర (రస్సెల్స్ వైపర్) ఎదురుపడ్డాయనుకోండి. క్షణాల్లో భీకర పోరాటం జరుగుతుందని చాలా మంది ఊహిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలు కూడా అదే అభిప్రాయాన్ని బలపరుస్తాయి. కానీ ప్రకృతి మాత్రం పూర్తిగా భిన్నమైన కథ చెబుతోంది. ఒకదానికొకటి విషపూరితమైన పాములే అయినా.. అవి మొదట ఎంచుకునేది పోరాటాన్ని కాదు.. ప్రాణాలను కాపాడుకోవడాన్నే.

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషపూరిత పాముల్లో నాగుపాము, రక్తపింజర రెండూ ఉన్నాయి. రెండింటి విషం ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంటే.. రక్తపింజర విషం రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీస్తూ తీవ్రమైన అంతర్గత రక్తస్రావానికి దారితీయగలదు. అందుకే రెండూ అత్యంత ప్రమాదకరమైన పాములుగా గుర్తింపు పొందాయి.

అయితే ఈ రెండు పాములు ఎదురుపడితే వెంటనే కాట్లతో ఒకదానిపై మరొకటి విరుచుకుపడతాయని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే ప్రతి కాటు వేయడానికి విషాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. విషాన్ని ఉత్పత్తి చేయడానికి శరీరం ఎంతో శక్తిని ఖర్చు చేస్తుంది. అనవసరంగా విషాన్ని వృథా చేసుకోవడం ఏ పాముకూ ప్రయోజనం కాదు. అందుకే సాధ్యమైనంత వరకు ఘర్షణను నివారించడానికే ప్రయత్నిస్తాయి.

నాగుపాము ప్రమాదం అనిపిస్తే ముందుగా పడగ విప్పి బుసకొడుతుంది. అది దగ్గరకు రావద్దు అనే హెచ్చరిక. మరోవైపు రక్తపింజర తన శరీరాన్ని బిగిగా ముడుచుకుని గట్టిగా బుసకొడుతూ అప్రమత్తం చేస్తుంది. ఈ హెచ్చరికల తర్వాత కూడా ప్రమాదం తప్పదని భావిస్తే మాత్రమే కాటు వేయడానికి సిద్ధమవుతాయి.

ప్రకృతిలో ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు చాలా సందర్భాల్లో రెండూ నెమ్మదిగా దూరమైపోతాయి. ఎందుకంటే పోరాటంలో గెలిచినా గాయపడే ప్రమాదం ఉంటుంది. విషపూరిత పాములకు కూడా గాయాలు ప్రాణాంతకమే. వేటాడేందుకు, ఆహారం సంపాదించేందుకు, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఆరోగ్యంగా ఉండటం వాటికి అత్యంత ముఖ్యం.

అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఘర్షణకు అవకాశం ఉంటుంది. తప్పించుకునే మార్గం లేకపోవడం, ఒకదానిని మరొకటి ప్రమాదంగా భావించడం లేదా మనుషులు వాటిని ఒకేచోట ఇరికించడం వంటి సందర్భాల్లో మాత్రమే పోరాటం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ అలాంటి సంఘటనలు ప్రకృతిలో చాలా అరుదుగా నమోదవుతుంటాయి.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే “నాగుపాము వర్సెస్ రక్తపింజర” వీడియోల్లో చాలా వరకు సహజ పరిస్థితుల్లో చిత్రీకరించినవి కావు. కొన్నింటిలో మనుషుల జోక్యం ఉండగా, మరికొన్ని బంధించిన పరిస్థితుల్లో తీసినవిగా నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వాటిని చూసి ప్రకృతిలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుందని భావించడం సరైంది కాదు.

నాగుపాము, రక్తపింజర రెండూ భయంకరమైన విషపూరిత పాములే. అయినప్పటికీ వాటి ప్రపంచంలో గెలవడం కంటే బతకడానికే ఎక్కువ విలువ ఉంటుంది. అందుకే ఎదురుపడినా పోరాటం కంటే.. ఎవరి దారి వారిదే అనే సూత్రాన్నే ఎక్కువగా పాటిస్తాయి. ప్రకృతి మనకు చెప్పే పెద్ద పాఠం కూడా ఇదే.

Follow Us
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
పచ్చిమిర్చి చికెన్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి..
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అండగా గవాస్కర్, చాపెల్
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
117 ఏళ్ల ఎథెల్‌.. చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా ..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆ తర్వాత
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?
ఐపీఎల్ కంటే ముందే భారత జట్టులోకి.. మూడో ప్లేయర్ ఎవరంటే?