ఈ నెల 21న సీఎం కేసీఆర్ కీలక భేటీ…ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే !

ఈ నెల 21న సీఎం కేసీఆర్ కీలక భేటీ...ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ నెల 21 మరోమారు..ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Jyothi Gadda

|

May 19, 2020 | 12:58 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ నెల 21 మరోమారు..ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమావేశం ప్రధాన ఎజెండా పరిశీలించినట్లయితే…

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు. వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధ రెండు రోజుల పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu