AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌.. RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు! డిగ్రీ పాసైతే చాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, CBAT, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది..

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌.. RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు! డిగ్రీ పాసైతే చాలు
RRB Section Controller Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 16, 2026 | 7:42 AM

Share

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సెక్షన్‌ కంట్రోలర్‌ (CEN No.03/2026) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ జోన్ల వారీగా పోస్టుల వివరాలు..

  • అహ్మదాబాద్ పోస్టుల సంఖ్య: 11
  • అజ్‌మేర్ పోస్టుల సంఖ్య: 1
  • బెంగళూరు పోస్టుల సంఖ్య: 8
  • భోపాల్ పోస్టుల సంఖ్య: 6
  • భువనేశ్వర్ పోస్టుల సంఖ్య: 6
  • బిలాస్‌పూర్ పోస్టుల సంఖ్య: 4
  • చండీగఢ్ పోస్టుల సంఖ్య: 6
  • చెన్నై పోస్టుల సంఖ్య: 9
  • గువాహటి పోస్టుల సంఖ్య: 1
  • జమ్ము అండ్‌ శ్రీనగర్ పోస్టుల సంఖ్య: 10
  • కోల్‌కతా పోస్టుల సంఖ్య: 8
  • మాల్దా పోస్టుల సంఖ్య: 7
  • ముంబయి పోస్టుల సంఖ్య: 6
  • ముజఫర్‌పూర్ పోస్టుల సంఖ్య: 3
  • పట్నా పోస్టుల సంఖ్య: 6
  • ప్రయాగ్‌రాజ్ పోస్టుల సంఖ్య: 4
  • రాంచీ పోస్టుల సంఖ్య: 14
  • సికింద్రాబాద్ పోస్టుల సంఖ్య: 5
  • సిలిగురి పోస్టుల సంఖ్య: 5
  • గోరఖ్‌పూర్ పోస్టుల సంఖ్య: 5
  • తిరువనంతపురం పోస్టుల సంఖ్య: 4

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో తప్పనిసరిగా గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 14, 2026వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. కేవలం సింగిల్‌ స్టేజ్‌ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(CBAT), ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జులై 15, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్‌ 14, 2026.
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్ట్‌ 16, 2026.
  • దరఖాస్తు సవరణ తేదీలు: ఆగస్ట్ 17 నుంచి 26 వరకు
  • అభ్యర్థులు తమ స్క్రైబ్ వివరాలను దరఖాస్తులో అందించాల్సిన తేదీలు: ఆగస్ట్‌ 27 నుంచి 31 వరకు

ఆర్‌ఆర్‌బీ రైల్వేలో సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం
గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త 'ఇమ్మర్సివ్ నావిగేషన్'.. వివరాలివే
గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త 'ఇమ్మర్సివ్ నావిగేషన్'.. వివరాలివే
వచ్చే నెల నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్..
వచ్చే నెల నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్..
అతనో బ్రేకులు లేని బుల్డోజర్‌.. మొన్న జస్ట్ మిస్.. నేడు బడితపూజే
అతనో బ్రేకులు లేని బుల్డోజర్‌.. మొన్న జస్ట్ మిస్.. నేడు బడితపూజే
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ డెసిషన్
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ డెసిషన్
వోక్స్‌వ్యాగన్ టైరాన్ లైఫ్ ఎస్‌యూవీ ప్రత్యేకతలివే
వోక్స్‌వ్యాగన్ టైరాన్ లైఫ్ ఎస్‌యూవీ ప్రత్యేకతలివే
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ సరికొత్త ఫీచర్లు ఇవే
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ సరికొత్త ఫీచర్లు ఇవే
ఏపీలో వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ 7న కొత్త పథకం
ఏపీలో వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ 7న కొత్త పథకం