వైసీపీ నేత హత్యకు కుట్ర..! లక్షల్లో సుపారీ

ఓ వైసీపీ నేతను హతమార్చేందుకు కుట్ర చేశారు దుండగులు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. ఇదంతా గమనించిన పోలీసులు అదును చూసి సుపారీ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు ఓ సుపారీ గ్యాంగ్ యత్నించింది. హత్యకు ప్లాన్ చేసి.. పలుమార్లు రెక్కి నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా.. వీరిపై అనుమానం […]

వైసీపీ నేత హత్యకు కుట్ర..! లక్షల్లో సుపారీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 03, 2020 | 12:41 PM

ఓ వైసీపీ నేతను హతమార్చేందుకు కుట్ర చేశారు దుండగులు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. ఇదంతా గమనించిన పోలీసులు అదును చూసి సుపారీ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవి.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు ఓ సుపారీ గ్యాంగ్ యత్నించింది. హత్యకు ప్లాన్ చేసి.. పలుమార్లు రెక్కి నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా.. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా పెట్టారు. అయితే చిరంజీవిని అరెస్ట్ చేసేందుకు 10 లక్షల డీల్ మాట్లాడుకున్న సుఫారీ గ్యాంగ్.. అందులో ముందుగానే  4 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకుంది. కాగా ఈ హత్యలో రౌడీషీటర్ కన్నబాబుకు.. పలాస రౌడీషీటర్ పరమేష్ సహకారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

అయితే.. చిరంజివి కదలికలపై రెక్కీ నిర్వహించి.. హత్యకు స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగింది సుపారీ గ్యాంగ్. వారిని పసిగట్టిన పోలీసులు. . ఇద్దరు రౌడీషీటర్లు సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 కత్తులు, 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా.. ఈ హత్యకు పాత కక్షలు, భూ వివాదాలే కారణమని సమాచారం.