జ్యోత్స్న మృతి కేసు: బయటపడుతున్న వాస్తవాలు
విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో పలు వాస్తవాలు బయటపడుతున్నాయి. అంకుర్ గదిలోకి జ్యోత్స్న వెళ్లినప్పుడు ఫ్లాట్‌లో పవన్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా గతంలో జ్యోత్స్న రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించిందని.. ఈ విషయాన్ని అంకుర్ ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాడని తెలుస్తోంది. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే జ్యోత్స్న […]

విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో పలు వాస్తవాలు బయటపడుతున్నాయి. అంకుర్ గదిలోకి జ్యోత్స్న వెళ్లినప్పుడు ఫ్లాట్‌లో పవన్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా గతంలో జ్యోత్స్న రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించిందని.. ఈ విషయాన్ని అంకుర్ ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాడని తెలుస్తోంది. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే జ్యోత్స్న కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని విశాఖకు వెళ్లనున్నారు.