అదనపు కట్నం కోసం.. అబార్షన్ చేయించాడు..

విశాఖలో అదనపు కట్నం కోసం నిండు గర్భిణీని వేధించాడో కట్నపిశాచి. మూడు సార్లు అబార్షన్ చేయించి, అత్యంత క్రూరంగా బ్లేడ్‌తో చేతిపై తీవ్రంగా గాయపర్చాడు ఆ దుర్మార్గుడు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. నిండు గర్భిణి అని చూడకుండా కారులో దాడి చేశారు అత్త, భర్త. దామోదర రావు, రాజేశ్వరిలు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత నుంచి.. అదనపు కట్నం 25 లక్షలు ఇచ్చేంత వరకూ బిడ్డకు జన్మనివ్వకూడదంటూ.. చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. […]

అదనపు కట్నం కోసం.. అబార్షన్ చేయించాడు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 18, 2019 | 3:15 PM

విశాఖలో అదనపు కట్నం కోసం నిండు గర్భిణీని వేధించాడో కట్నపిశాచి. మూడు సార్లు అబార్షన్ చేయించి, అత్యంత క్రూరంగా బ్లేడ్‌తో చేతిపై తీవ్రంగా గాయపర్చాడు ఆ దుర్మార్గుడు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. నిండు గర్భిణి అని చూడకుండా కారులో దాడి చేశారు అత్త, భర్త.

దామోదర రావు, రాజేశ్వరిలు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత నుంచి.. అదనపు కట్నం 25 లక్షలు ఇచ్చేంత వరకూ బిడ్డకు జన్మనివ్వకూడదంటూ.. చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. స్థానికుల సాయంతో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

భర్త, అత్త దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. అత్యంత దారుణంగా తనపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజేశ్వరి. తన కడుపులో బిడ్డ అనాథ కారాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు.