India Post: యువతకు శుభవార్త.. ఇక నుంచి పోస్టాఫీసుల్లో ఫ్రీ వైఫై.. లైబ్రరీ సౌకర్యం కూడా..
యువతను ఆకట్టుకునేందుకు పోస్టల్ శాఖ కొత్త పోస్టాఫీసులను తీసుకొస్తుంది. అదిరిపోయే లుక్‌తో స్మార్ట్ సేవలను ఇందులో ప్రవేశపెడుతోంది. ఇందులో ఉచితంగా అనేక సేవలు పొందవచ్చు. ప్రస్తుతం విశాఖలో ఒక కొత్త పోస్టాఫీస్‌ను ప్రారంభించగా.. త్వరలో మిగతా ప్రాంతాల్లో కూడా తీసుకురానుందని తెలుస్తోంది.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ సరికొత్త పంథాలో ముందుకెళ్తుంది. ప్రైవేట్ కొరియల్ సంస్థలకు పోటీగా నిలిచేందుకు కొత్త మార్గంలో వెళుతుంది. అందులో భాగంగా యువతను ఆకట్టుకునే దిశగా కొత్త బాటలో వెళ్తుంది. యువతను ఆకర్షించేందుకు జెన్‌జీ పోస్టాఫీసులను నూతనంగా తీసుకొస్తుంది. జెన్‌జెడ్ ధీమ్‌లతో తీసుకొస్తున్న ఈ పోస్టాఫీసులను యువతను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతోంది. ఇటీవల ఢిల్లీ, ముంబైలో ఇలాంటి పోస్టాఫీసులను తీసుకురాగా.. తాజాగా ఏపీలో కూడా ప్రారంభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో జెన్‌జెడ్ ధీమ్‌లో పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. చాలా స్మార్ట్, స్ట్రైలిష్‌గా ఉన్న ఈ పోస్టాఫీస్ యువతను తెగ ఆకట్టుకుంటోంది.
డిజిటల్ ఫస్ట్ ఇండియాలో భాగంగానే ఈ పోస్టాఫీసును ప్రారంభించినట్లు పోస్టల్ శాఖ చెబుతోంది. ఈ పోస్టాఫీసుల్లో కేవలం సాధారణ సేవలు కాకుండా సోషల్ టెర్నింగ్ సెంటర్లుగా ఉండనున్నాయి. విద్యార్థులు ఇక్కడే కూర్చోని బుక్స్ చుదువుకునేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా విద్యార్థుల కోసం ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంటుంది. ఇక్కడ యువత కోసం ఫ్రీ వైఫై సౌకర్యం కూడా ఉంటుంది. త్వరలో గుంటూరు, కర్నూలులో కూడా జెన్‌జెడ్ పోస్టాఫీసులను ప్రారంభించనున్నారు. యువత కోసం ప్రత్యేక రూమ్‌లు, చైర్స్ వీటిల్లో ఉంటాయి.
అయితే ఈ పోస్టాఫీసుల్లో అధికారులు ఎవ్వరూ ఉండరు. విద్యార్థులే తమ ఫోన్, క్యూఆర్‌కోడ్‌లు ఉపయోగించి పోస్టల్ సేవలు పొందవచ్చు. క్యూఆర్ ఆధారంగా పార్శిల్ బుకింగ్‌లు, స్పీడ్ పోస్ట్ వంటి సేవలు పొందవచ్చు. కేవలం పోస్టల్ శాఖ నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఇక్కడ ఉంటారు. అతడి ద్వారా విద్యార్థులు సహాయం పొందవచ్చు. టెక్నాలజీని యువతకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ జెన్‌జెడ్ పోస్టాఫీసులను ప్రవేశపెట్టిట్లు పోస్టల్ శాఖ అధికారరులు చెబుతున్నాయి. డిజిటల్ ఇండియా స్పూర్తితో వీటిని తెచ్చినట్లు తెలిపారు. ఈ జెన్ జెడ్ పోస్టాఫీసులపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. డిజిటల్ ఇండియా ఇప్పుడు మరింత దగ్గరైందని, పోస్టాఫీస్‌కు కొత్త జనరేషన్ టచ్ వచ్చిందని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రంలో తొలి జెన్‌జెడ్ పోస్టాఫీస్ ప్రారంభించాయని, క్యాంపస్ కల్చర్‌కు అనుగుణంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుందన్నారు.
ఆంధ్రా ఆన్ ది మాప్! 📍
పోస్టాఫీస్‌కు కొత్త జెనరేషన్ టచ్!
విశాఖ — ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రంలో తొలి #GenZPostOffice.
పూర్తిగా డిజిటల్, క్యాంపస్ కల్చర్‌కి అనుగుణంగా,విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుని,వారి అవసరాలకు సరిపోయేలా అందుబాటులోకి.
డిజిటల్ ఇండియా…… https://t.co/zn3FZB57xE
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) December 9, 2025




