భారీ అగ్నిప్రమాదం.. 50 షాపులు దగ్ధం
విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ నడిబొడ్డులో ఉన్న చిన్న మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో...

విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ నడిబొడ్డులో ఉన్న చిన్న మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 50 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు మార్కెట్‌లోని దుకాణాలు, సరుకులు కాలి బూడిదయ్యాయి. మార్కెట్‌లో అంతా చిన్న వ్యాపారులే ఉండగా.. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.